కెవ్వ్.. గట్టిగా అరిస్తే అన్ని లాభాలా? అమ్మాయిలూ ఇది మీ కోసమే!
అరిచి చల్లబడండి అంటున్నారు ఇప్పుడు సైకాలజిస్టులు. ఇదే ఆరోగ్యానికి మంచిదట. ఆ కథా కమామిషు ఇక్కడ చూద్దాం.
మీకు కోపం వస్తే ఏం చేస్తారు? గట్టిగా అరిచేస్తారు కదా. అయితే, అది చాలా చెడ్డ అలవాటని చాలామంది అంటారు. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం.. అది చాలామంచిదని అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు మౌనంగా ఉండకుండా కోపం వచ్చినప్పుడు గట్టిగా అరిచేయాలట. దాని వల్ల వారికి చాలా లాభాలు ఉన్నాయట. ఎంత గట్టిగా అరిస్తే అంత త్వరగా చల్లపడతారట. అది ఎలాగో చూసేయండి మరి.
ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేదా భావోద్వేగ నిర్వహణ ఇవ్వన్నీ ఉండాలని మనందరం అనుకుంటాం. ప్రస్తుతం చాలా మంది అందుకోసం ప్రత్యేక థెరపీలు సైతం తీసుకుంటున్నారు. అయితే ఎంత ఈక్యూ బావున్నప్పటికీ మనం చాలా సార్లు గట్టిగా అరిస్తే బావుణ్ణు అనే పరిస్థితుల ఎదురవుతూనే ఉంటాయి. అలా కంట్రోల్ కాని సందర్భాల్లో అరిచి చల్లబడండి అంటున్నారు ఇప్పుడు సైకాలజిస్టులు. ఇదే ఆరోగ్యానికి మంచిదట. ఆ కథా కమామిషు ఇక్కడ చూద్దాం.
ఒక్కోసారి ఎమోషన్స్ బ్యాలెన్స్ తప్పుతుండటం సహజమే. అయితే ఎమోషనల్ స్ట్రెస్ ను మనసులో దాచుకోవడం కంటే దానిని వెల్లగక్కడమే మంచిదని బిహెవియర్ థెరపిస్ట్ ప్రజ్ఞా అగర్వాల్ అంటున్నారు. లాఫ్బరో యూనివర్సిటికి చెందిన ఈమె కోపాన్ని, స్ట్రెస్ ను అరిచి బయట పెట్టడం న్యూరో ఫిజికల్ రెస్పాన్స్ కి మేలు చేస్తుందని అంటున్నారు.
అప్పుడప్పుడు అరచి కేకలు వేయడం వల్ల లోపల దాగి ఉన్న కోపం బయటకు వెళ్లి పోతుంది. కోపం బయటకు వెల్ల గక్కడం వల్ల కూడా ఎండార్ఫిన్స్ విడుదలవుతాయట. ఎండార్ఫిన్లకు హాప్పీ హార్మోన్లని పేరు. మాములుగా ఎండార్ఫిన్లు సంతోషంగా ఉన్నపుడు, వ్యాయామం తర్వాత విడుదలవుతాయి. అలాగే కోపంతో అరిచినపుడు కూడా శరీరంలో ఇలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. పిట్యూటరీ గ్రంధి నుంచి పెప్టైడ్లతో పాటు ఈ ఎండార్ఫిన్లు కలిసి నొప్పిని తట్టుకునే శక్తిని శరీరానికి ఇస్తాయి. అంతేకాదు మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది.
అయితే ఈ స్క్రీమింగ్ థెరపీ పాతవిషయమే అని జాన్ లెన్నాస్, యోకోవోనో వంటి ప్రముఖులు కూడా ఈ స్క్రీమింగ్ థెరపి సేషన్స్ తీసుకున్నారని ప్రజ్ఞ అంటున్నారు. 60 వ దశకం నుంచే స్ట్రేస్ మేనేజ్మెంట్ లో ఈ చికిత్సా విధానం వాడుకలో ఉంది. దీనిని ప్రిమల్ థెరపి అంటారు.
అరిచేయడం అనేది చాలా మంచిదని రకరకాల అధ్యయనాలు చెబుతున్నాయి. కొంత మంది కలిసి సమూహంగా అరవడం వల్ల ఎంతో మంది మనతో ఉన్న భావన కలిగి ఒంటరితనం మాయం అవుతుంది. అందువల్ల అడ్రినలిన్ ఉత్పత్తి పెరుగుతుందని న్యూయర్క్ యూనివర్సిటి సైకలాజిస్టులు అంటున్నారు. గట్టిగా అరవడం వల్ల శారీరక బలం పెరుగుతుందని అయోవా స్టేట్ యూనివర్సిటి నిపుణులు కూడా అంటున్నారు.
అయితే ఇది మహిళలకు మరీ మంచి థెరపి అంటున్నారు. స్త్రీలు చిన్నతనం నుంచి సహనంగా ఉండాలని, గట్టిగా అరచి మాట్లాడకూడదని రకరకాల ఆంక్షల మధ్య ఎన్నోసార్లు భావోధ్వేగాలను అణచి పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వారిలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
స్త్రీలుగా సహనంతో ఉండాలి, కోపం, విసుగు, బాధ వంటి నెగెటివ్ ఎమోషన్స్ బయటకు చూపకూడదని చాలా వరకు వాటిని బయట పెట్టరు. కానీ అవి అలా దాచుకోవాల్సిన అవసరం లేదన్న అవగాహన ముందుగా వారికి కలిగించాలనేది ప్రజ్ఞ అభిప్రాయం. ఏక్స్ ప్లోడింగ్ ది మిత్ ఆఫ్ జెండర్డ్ ఎమోషన్స్ అనే పుస్తకంలో ప్రొఫెసర్ అగర్వాల్ మన వ్యక్తిత్వంలో భావవ్యక్తీకరణ కూడా ఒక భాగం అని వివరించారు. తొందరపడి అభిప్రాయ వ్యక్తీకరణ చేసేవారు తరచుగా నవ్వుల పాలవుతారని, అందువల్ల తప్పని సరి పరిస్థితుల్లో భావావేశాన్నిమనసులోనే దాచుకోక తప్పదు. అందుకే ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే తప్పనిసరిగా స్క్రీమింగ్ సేషన్స్ అవసరం అని ప్రజ్ఞ అభిప్రాయపడుతున్నారు.
చైనాలో ఈ స్క్రీమింగ్ చాలా ప్రాక్టీస్ లో ఉందట. మన దగ్గర లాఫింగ్ క్లబ్ ల మాదిరిగా అక్కడ స్క్రీమింగ్ క్లబ్బులు ఉన్నాయట. అందరూ కలిసి పొద్దున్నే ఈ సెషన్స్ లో పాల్గొంటారట. ఈ సెషన్స్ ప్రారంభించినప్పటి నుంచి ఆమె కుటుంబంతో ఆనందంగా ఉంటున్నట్టు కూడా తెలియజేశారు. రిలాక్స్ కావాలని అనుకుంటే ఏదైనా మైదానానికి వెళ్లి ఒకసారి శక్తి మేరకు అరిచేస్తే సరిపోతుంది. ఇది కూడా ఒత్తిడిని జయించే మరోమార్గం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.