Mosquito Bites: దోమలు మిమ్మల్నే ఎందుకు కుడుతున్నాయని ఫీలవ్వుతున్నారా? బ్లడ్ గ్రూప్ వల్ల కాదు, అసలు రహస్యం ఇదీ!
దోమలు కొంతమందినే ఎక్కువగా కుడుతుంటాయి. ఇందుకు బ్లడ్ గ్రూపే కారణమని గత పరిశోధనలు తెలిపాయి. అయితే, తాజా పరిశోధనలో అసలు రహస్యం బయటపడింది. అదేంటో చూడండి.
ఒక గుంపు వ్యక్తులు ఒకేచోట ఉన్నప్పుడు కొంత మంది దోమలు బాగా కుడుతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. వారి చుట్టే దోమలు తిరుగుతూ ఉంటాయి. మిగతా వారంతా కూడా పెద్దగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించదు. దోమలు కొంత మందిని మాత్రమే ఎందుకు కుడతాయి? దోమలు కేవలం వారిని మాత్రమే ఎందుకు ఆకర్షిస్తాయి? అని తెలుసుకునేందుకు కొంతమంది నిపుణులు కొత్త పరిశోధన చేపట్టారు. అమెరికాకు చెందిన కెమికల్ సొసైటి వారి రియాక్షన్ బృందం తమ అధ్యయనం తర్వాత దోమలు ఎందుకు కొంత మందినే కుడుతాయనే విషయాన్ని వెల్లడించారు.
కొందరి చర్మం నుంచి వెలువడే రసాయనాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే ఆ రసాయనాలు ఏమిటి? అసలు వాటిని ఎలా గుర్తించారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలి వంటి వివరాలు తెలుసుకుందాం.
శరీరంలోని వేడి వల్ల మన శరీరంలోని రసాయనాలు ఉద్దీపనం అవుతాయి. ఆ తర్వాత అవి శ్వాస నుంచి వచ్చే కార్బన్ డైయాక్సైడ్ వల్ల వచ్చే వాసన వ్యాపిస్తుంది. దోమలు ఈ వాసన ద్వారానే వ్యక్తులను గుర్తిస్తాయి. అయితే, అలా ఎందుకు జరుగుతుందో ఊహించడం కష్టం. చర్మపు వాసన వల్ల కొంత మంది దోమలను ఆకర్షిస్తారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ఎన్నో అధ్యయనాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలు బ్లడ్ గ్రూప్ ప్రమేయం వల్ల కూడా దోమలను ఆకర్షించవచ్చనే వాదన కూడా ఉంది.
కొంత మంది ప్రెగ్నెన్పీ వల్ల కూడా దోమలు ఆకర్షించబడతాయని అంటున్నారు. తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన శరీర వాసన మారుతుందని దాన్ని బట్టి కూడా దోమలు ఆకర్షించబడతాయని కూడా ఒక వాదన ఉంది. అయితే రకరకాల అధ్యయనాలు రకరకాల ఫలితాల విశ్లేషణలు అందించడం వల్ల ఈ విషయంలో చాలా గందరగోళం ఏర్పడిందని చెప్పాలని సెల్ జర్నల్ అక్టోబర్‌లో ఇక ఆర్టికల్ ప్రచురించింది.
చర్మం మీద ఉండే కార్బాలిక్ యాసిడ్ మన సీబమ్‌లో ప్రత్యేక వాసనకు కారణం అవుతుంది. సీబమ్ చర్మాన్ని తేమగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. ఈ సారి పరిశోధకులు ఎంచుకున్న కొంత మందికి చేతుల మీద ధరించేందుకు ఫ్యాషన్ ఫార్వార్డ్ నైలాన్ తొడుగు(సాక్స్)లను అందించారు. తర్వాత వీటిని ఈడెన్ ఈజిప్టి దోమలు ఉన్న చోట వీటిని పెట్టారు. కొన్ని సాక్సులను ఇవి బాగా ఆకర్షించాయి. ఇందుకు చర్మం నుంచి నైలాన్ సాక్కుల మీద చేరిన రకరకాల కార్బాక్సిలిక్ ఆమ్లాలు కారణం అని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
ముఖ్యంగా పెంటాడేకానోయిక్, హెప్టాడెకానోయిక్, నాన్ డెకానోయిక్ లు అధిక స్థాయిలో ఉన్నవారు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తున్నారట. ఈ అధ్యయనం మూడు సంవత్సరాల వ్యవధిలో జరిగినందున పాల్గొనేవారు ఎలాంటి ఆహారం తీసుకున్నారు? బీరు వంటి ఆల్కహాల్ తీసుకున్నారా అనే విషయాలను అసలు పరిగణనలోకి తీసుకునే అవసరం లేదని ఈ కారకాలు స్థిరంగా ఉన్నాయనేది నిర్ధారణ అయ్యింది.
దోమలు ఎక్కువగా కుట్టే వారికి ఈ అధ్యయనం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. N, N-డైథైల్-మెటా-టోలమైడ్ అనే రసాయన సమ్మేళనం ఇది దోమలకు వాసన కనుక్కొవడం కష్టతరం చేస్తుంది. నిమ్మకాయ, యూకలిప్టస్ నూనె తో కూడా దోమలను నివారించడం సాధ్యమే. సిట్రొనెల్లా క్యాండిల్స్ దోమలను తరమలేవట. కాబట్టి వీటితో పెద్ద ఉపయోగం లేదు.
Also read : Breast milk: షాకింగ్, తల్లి పాలూ కలుషితమేనట? కొత్త పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial