Breast milk: షాకింగ్, తల్లి పాలూ కలుషితమేనట? కొత్త పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడి
ఇన్నాళ్లు తల్లి పాలకు మించిన ఔషదం లేదని మనం భావించాం. పరిశోధనలు కూడా అవే వెల్లడించాయి. కానీ, ఇప్పుడు.. ఆ పాలే ప్రమాదకరమని పరిశోధకులు చెప్పడం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. పిల్చే గాలి, తాగే నీరు, పండే పంట మాత్రమే కాలుష్యం అవుతున్నాయని అనుకుంటే పొరపాటే. కాలుష్యం చాలా తీవ్రమైన రూపం దాల్చుతోంది. ఎంత ఎక్కువ కాలుష్యం పెరిగిపోయిందంటే.. ఎంతో సురక్షితం అని భావించే తల్లి పాలను సైతం కలుషితం చేస్తున్నాయి. తల్లి పాలలో సైతం శిశువుల ఆరోగ్యానికి చెరుపు చేసి.. వారి అభివృద్ధి మీద ప్రభావం చూపే కాలుష్య రసాయన అవశేషాలు కనిపించాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
యుఎస్ కు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధనలో తల్లి పాలలో దాదాపు 25 రసాయనాలు ఉన్నట్లు తేలింది. ఇవ్వన్నీ కూడా శిశువుల ఆరోగ్యానికి చెరుపు చేసేవే కావడం గమనార్హం. దాదాపు 50 మంది తల్లుల పాలను విశ్లేషించారు. అన్ని సాంపిల్స్ లో పాలీ బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్టెంట్లు, తక్కువ ఫ్లేమబుల్ లక్షణాలు కలిగిన ఇతర మ్యాన్ మేడ్ రసాయనాల అవశేషాలు కనిపించాయట.
సీటెల్ లోని టాక్సిక్ ఫ్రీ ఫ్యూచర్ కి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు. యూస్ఏలో కొన్ని స్టేట్స్ లో ఎలక్ట్రానిక్స్ లో BFRల వినియోగాన్ని కూడా నియంత్రించారు. కానీ ఈ సమ్మేళనాల ఉత్పత్తి, వినియోగం కొనసాగుతూనే ఉంది. కంపెనీలు హానికారక రసాయనాల వినియోగాన్ని ఆపేసి.. సురక్షితమైన ప్రత్యామ్నాయలను ఎంచుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాలని, వాటిపై నిషేదం విధించే వరకు కూడా అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపే ప్రమాదం కొనసాగుతుందని పరిశోధకులు తెలిపారు.
బ్రోమినేటేడ్ ఫ్లేమ్ రిటార్టెంట్లు దాదాపుగా 75 రకాల రసాయనాల క్లాస్ గా చెప్పవచ్చు. వీటి పాత వెర్షన్లు కొన్ని 1970 నాటికే నిషేధించారు. కానీ కొత్త వెర్షన్లు ఉత్పత్తుల్లో వాడుతున్నారు. ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని ఈ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్చ్, అక్టోబర్ 2019 మధ్య కాలంలో సిటెల్ పరిసరాల్లోని మహిళను పరిశోధనకు ఎంచుకున్నారు. 25 బ్రోమినేటెడ్ ప్లేమ్ రిటార్టెంట్లు వీరిలో గుర్తించారు. ఇవన్నీ కూడా దశాబ్దం క్రితమే మార్కెట్లో నిషేధించబడినవి. వీటిని పాలీబ్రోమినేటెడ్ డైఫినైల్ ఈథర్స్(PBDEs) అని అంటారు. వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందట. కొన్ని రాష్ట్రాల్లో వీటి నిషేధం తర్వాత బ్రోమోఫెనాల్స్ కు మారాయి. ఇవైతే దాదాపు 88 శాతం మంది తల్లి పాలలో కనిపించాయట.
ఈ బ్రోమోనాల్స్ వల్ల మెదడు అభివృద్ధి మీద ప్రభావం చూపించవచ్చు. తల్లి పాలల్లో బ్రోమోఫెనాల్స్ పెరగడం చాలా ఆందోళనకరమని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నుంచైనా సురక్షితమైన రసాయనాలు మాత్రమే తమ ఉత్పత్తుల్లో ఉండే విధంగా కంపెనీలు వ్యవహరిస్తాయని, ప్రభుత్వాలు చట్టాలు రూపొందించాలని వీరు సూచిస్తున్నారు.
Also read : Skin Problems: స్నానం చేశాక బ్రష్ చేస్తున్నారా? ఇక మీ చర్మం పరిస్థితి అంతే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial