Skin Problems: స్నానం చేశాక బ్రష్ చేస్తున్నారా? ఇక మీ చర్మం పరిస్థితి అంతే!
చాలామంది బ్రష్ చేసిన తర్వాత స్నానం చేస్తారు. దానివల్ల చర్మ సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అదెలా అనుకుంటున్నారా? అయితే చూడండి.
‘‘Face is the index of the soul’’ అనే నానుడి వినే ఉంటారు. మన ముఖం మన అంతరంగాన్ని ప్రతిబింబిస్తుందని దీని అర్థం. ముఖం బావుంటే చాలు ఆత్మవిశ్వాసం దానికదే వచ్చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే బ్యూటీ ఇండస్ట్రీ ఇన్ని లక్షల కోట్ల వ్యాపారం చెయ్యగలుగుతోంది. ముఖం అందంగా కనిపించడంలో మొదటి పాత్ర పోసించేది చర్మ సౌందర్యమే. చర్మం రంగు ఏవిధంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంతో మిలమిల్లాడుతూ ఉంటే ఆ అందమే వేరు. అందుకే చర్మ సౌందర్యానికి సంబంధించిన రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. చర్మ సౌందర్యానికి సంబంధించిన చిట్కాలు మంచి సేలబుల్ టాపిక్.
ముఖం మీద మొటిమలు రావడం చాలా సాధారణమైన చర్మ సమస్య. సాధారణంగా చర్మంలో మోతాదుకు మించి సీబమ్ తయారైనపుడు చర్మం మీద ఉండే మృతకణాలు, ఇతర బ్యాక్టీరియా ఈ సీబంతో కలిసి మొటిమలు రావడానికి కారణం కావచ్చు. హార్మోన్ల వంటి ఇతర కారకాలు కూడా మొటిమలకు కారణం కావచ్చు. కానీ దంతధావనం కూడా మొటిమలకు కారణమవుతుందని మీకు తెలుసా? అవును, అశ్చర్యంగా ఉన్నా.. అది నిజమని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూడండి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా హవా మొదలయ్యాక ప్రతీ ఒక్కరూ అందం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్స్ నుంచి సాధారణ వ్యక్తుల వరకు చాలా మంది చాలా రకాల చర్మానికి సంబంధించిన జాగ్రత్తలు రీల్స్ ద్వారా, వీడియోల ద్వారా, పోస్టుల ద్వారా చెబుతూనే ఉన్నారు.
డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా అనే స్కిన్ ఎక్స్పర్ట్ చర్మానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఒక్కోసారి హడావిడిగా, ఏదో ఆలోచనలో ఉండి బ్రష్ చేసుకోలేదనే విషయం మరచిపోయి స్నానం చేసేస్తుంటాం. స్నానం తర్వాత బ్రష్షింగ్ గుర్తొచ్చి అప్పుడు బ్రష్ చేసేసుకుంటాం. ఇది ఎప్పుడో ఒకసారి పొరపాటున జరిగితే పర్వాలేదు.. కానీ అదే అలవాటుగా మారితే మాత్రం చర్మానికి చాలా నష్టం జరుగుతుందని గీతిక చెబుతున్నారు.
అసలు బ్రష్ చేసుకోవడానికి చర్మానికి ఏమిటీ సంబంధం అనుకుంటున్నారు కదా. మనం పళ్లు తోముకున్నపుడు బ్యాక్టీరియా నోటి నుంచి చర్మం మీదకు చేరే ఆస్కారం ఎక్కువట. అందువల్ల నోరు చుట్టు, గడ్డం చుట్టు ఇరిటేషన్ రావచ్చు. తర్వాత నెమ్మదిగా అది మొటిమలకు కారణం అవుతుందట. బ్రష్ చేసే సమయంలో చర్మం మీదకు ట్రాన్స్ఫర్ అయిన బ్యాక్టీరియా వల్ల చర్మం మీద పగుళ్లు కూడా ఏర్పడవచ్చని డాక్టర్ గీతిక హెచ్చరిస్తున్నారు. అందుకే స్నానానికి ముందే బ్రష్ చేసుకోవడం సురక్షితం మరి. ఒక వేళ స్నానం తర్వాత బ్రష్ చేసినా.. ముఖాన్ని మరోసారి సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం ముఖ్యమని అంటున్నారు.
View this post on Instagram
Also read : తరచుగా అజీర్తి చేస్తోందా? పొట్టలో అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుందా? ఈ వ్యాధే కారణం కావచ్చు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial