అన్వేషించండి

Salt is a Global Killer: ఓ మై గాడ్ - ఉప్పు తిని అంతమంది చనిపోతున్నారా? WHO గణంకాలు చూస్తే షాకవుతారు

Salt side effects: ఉప్పు ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసిందే. కానీ, అది స్లో పాయిజన్‌లా ఏటా లక్షలాది ప్రజల ప్రాణాలు తీస్తోందంటే నమ్ముతారా?

WHO Warning : ఉప్పులేని వంటను ఊహించుకోలేము. వంటలో ఉప్పు ఒక ముఖ్యమైన పదార్థం. ఉప్పు ఆహారపు రుచిని పెంచుతుంది. అది ఆరోగ్యకరం కాదని తెలిసినా.. రుచి కోసం తినక తప్పదు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండెజబ్బులతోపాటు పలు సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. అధిక ఉప్పు కారణంగా ఏటా 1.89 మిలియన్ల మంది మరణిస్తున్నారని తేలింది. అసలు ఉప్పుకు, ప్రపంచ మరణాల మధ్య ఉన్నలింక్ ఏంటో చూద్దాం. 

ఉప్పులో ఎక్కువగా కనిపించే పదార్థం సోడియం. ఇది సాధారణ కణాల పనితీరును నిర్వహించడానికి సహాయపడే ముఖ్యమైన పోషకం. ఇది పాలు, మాంసం వంటి వివిధ ఆహారాలలో కూడా సహజంగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, అకాల మరణాల ప్రమాదం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య కేంద్రం నివేదిక తెలిపింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం.. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అంతేకాదు ఇప్పటికే గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది.

ఎంత మొత్తంలో ఉప్పు తీసుకోవాలి?

పెద్దలు (అడల్ట్స్) రోజుకు 2000 మిల్లీగ్రాములు.. లేదా 2 గ్రాముల ఉప్పు తినాలని WHO సిఫార్సు చేసింది. అంటే ఇది ఒక టీస్పూన్ కంటే తక్కువ. అయితే, పిల్లలకు, వారి శక్తి అవసరాలకు అనుగుణంగా మోతాదును బట్టి ఇవ్వవచ్చు. అలాగని మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి ఉప్పులో అయోడిన్ అవసరమని డబ్య్లూహెచ్ఓ సిఫార్సు చేస్తోంది.

ఉప్పు వినియోగాన్ని ఎలా తగ్గించాలి?

ఆహారం రుచిగా ఉండాలంటే ఉప్పు చాలా అవసరం కాబట్టి.. ఉప్పును పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదు. ఇంట్లో వండిన తాజా ఆహారం తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా నివారించడం మంచిది. మోతాదుకు మించిన ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

ఉప్పు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు

☀ టెబుల్ మీద సాల్ట్ డబ్బా తీసెయ్యాలి.
☀ వండే సమయంలో వేసిన ఉప్పు కంటె ఎక్కువ వాడకుండా భోజనం పూర్తిచెయ్యాలి.
☀ ప్రాసెస్డ్ ఫూడ్ వీలైనంత తగ్గించాలి. వీలైతే మానెయ్యడం మంచిది
☀ పాపడ్, ఊరగాయల వంటివి తీసుకోవడం తగ్గించాలి.
☀ సముద్రపు ఉప్పయినా, పింక్ సాల్ట్ ఏదైనా సరే అందులో సోడియం ఉంటుందని మరచి పోవద్దు. ఉప్పు ఏదైనా సరే తగ్గించి తీసుకోవడం తప్పనిసరి.
☀ ఇంట్లో వండిన ఆహారంలో కంటే రెస్టారెంట్లలో తినే ఫూడ్, ప్యాక్డ్ ఫూడ్ లో ఎక్కువ ఉప్పు వాడుతుంటారు కనుక బయటి తిండి మానెస్తే సగం ఉప్పు వినియోగం తగ్గించినట్టే.
☀ సలాడ్ వంటి కొన్నింటిలో ఉప్పు రుచి తగలకపోవచ్చు కానీ వాటిలో సోడియం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. బయట తింటున్నపుడు సూప్ లేదా సాస్ ఉపయోగించే తినే పదార్థాలను ఆర్డర్ చెయ్యక పోవడమే మంచిది.

Also Read : ఈ మౌత్​ వాష్​లను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget