News
News
వీడియోలు ఆటలు
X

Menopause Diet: మెనోపాజ్ డైట్ అంటే ఏంటి? ఏయే ఆహారాలు తీసుకోవాలి

మహిళల జీవితంలో మెనోపాజ్ దశ చాలా ముఖ్యమైనది. అటువంటి సమయంలో మంచి ఆహారం తీసుకోవాలి.

FOLLOW US: 
Share:

ప్రతి స్త్రీ జీవితంలో మెనోపాజ్ దశ ఒక అంతర్భాగం. 40 దాటిన మహిళల్లో ఎప్పుడైనా మెనోపాజ్ దశ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మెనోపాజ్ దశ వచ్చే ముందు కొన్ని లక్షణాలు, నొప్పులు భరించాల్సి ఉంటుంది. ఈ దశని ఎదుర్కొనేందుకు మహిళలు నిర్దిష్ట జీవనశైలి అనుసరించాలీ. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి క్షీణిస్తుంది. ఆరోగ్యంలో సమస్యలు, ఎముకల సాంద్రత క్షీణించడం జరుగుతుంది. తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆహార పదార్థాలను మీ మెనూలో చేర్చుకోవడం ముఖ్యం.

మెనోపాజ్ డైట్ లో ఏం తీసుకోవాలి?

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం

రోజంతా క్రమం తప్పకుండా ప్రోటీన్ తినడం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల క్షీణతను అడ్డుకోవచ్చు. మెనోపాజ్ లో ఉండే ఉండే స్త్రీలు ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి. ప్రతి భోజనంలో 20-25 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ చేర్చుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు, గింజలు, పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వేడి ఆవిర్లు, రాత్రి చెమట తీవ్రతను తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. మాకేరెల్, సాల్మన్, ఆంకోవిస్, అవిసె గింజలు, చియా, సబ్జా గింజల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.

కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మెనోపాజ్ సమయంలో హార్మోన్లలో మార్పులు ఎముకలు బలహీనపడటానికి కారణమవుతుంది. బోలు ఎముకలు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి.

ఈస్ట్రోజెన్ కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఫైటోఈస్ట్రోజెన్ మొక్కల ఆధారిత సమ్మేళనం. ఇవి తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సోయా బీన్స్, టోఫు, టెంపె, అవిసె గీజన్లు, శనగలు, వేరుశెనగ వంటి వాటిలో ఫైటో ఈస్ట్రోజెన్ అధికంగా లభిస్తుంది.

హూల్ గ్రెయిన్ డైట్ పాటించాలి. గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్, బారళీమ క్వినోవా వంటివి తీసుకోవాలి.

సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బెర్రీలు, యాపిల్స్, క్రూసిఫెరస్ కూరగాయలు తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి.

మెనోపాజ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. కొంతమందికి తీవ్ర అసౌకర్యంగా ఉంటే మరికొందరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హార్ట్ బీట్ లో మార్పులు, కీళ్ళు, కండరాల నొప్పి, లిబిడీలో మార్పులు, ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం, జుట్టు రాలడం లేదా సన్నబడటం జరుగుతుంది. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెనోపాజ్ లక్షణాల నుంచి వచ్చే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ధూమపానం, కెఫీన్ తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటి వల్ల మెనోపాజ్ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి. అందువల్ల వీలైనంత వరకు వాటిని నివారించడం ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వేసవిలో జలుబు వేధిస్తోందా? ఈ సహజమైన పద్ధతులు పాటించారంటే సూపర్ రిలీఫ్

Published at : 20 Apr 2023 07:00 AM (IST) Tags: Menopause Menopause Symptoms Menopause Remedies Menopause Diet

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!