అన్వేషించండి

Summer Health Tips: వేసవిలో జలుబు వేధిస్తోందా? ఈ సహజమైన పద్ధతులు పాటించారంటే సూపర్ రిలీఫ్

జలుబు చలికాలంలోనే కాదు వేసవిలోనూ ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి. మంచి రిలీఫ్ దొరుకుతుంది.

వేసవిలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల వైరస్ లు చుట్టుముట్టడంతో అనారోగ్యానికి గురవుతారు. ఈ టైమ్ లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లు చురుకుగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీటిని బారిన పడిపోతారు. చలికాలంలోనే జలుబు చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వేసవిలోని వెచ్చని గాలుల కారణంగా వేడి జలుబు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేడిగా ఉన్నప్పుడు రైనోవైరస్ జలుబుకి కారణమవుతుంది. ఇది సులభంగా వ్యాప్తి చెందుతుంది.

వేసవిలో అలర్జీ 

జలుబు లేదా వేసవి అలర్జీలు ఉన్నాయా అని చెప్పడం కాస్త కష్టమే అయినప్పటికీ ఈ రెండింటికీ మధ్య తేడాలు ఉన్నాయి. తుమ్ములు, ముక్కు కారటం, దురద, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఈ రెండు వ్యాధుల్లో సాధారణంగా కనిపిస్తాయి. అయితే సాధారణంగా చేసే జలుబు వల్ల దగ్గు చెమటలు, జ్వరం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతే కాదు జలుబు ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీలు దాని కంటే ఎక్కువ కాలం పాటు ఉండి ఇబ్బంది పెట్టేస్తాయి. వేసవిలో చేసే జలుబు నుంచి బయట పడేందుకు కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తే చాలు డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండానే జలుబును తగ్గించుకోవచ్చు.

విశ్రాంతి

అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి, నిద్ర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థను మరింత బలహీనపరిచే అధిక శ్రమతో కూడిన శారీరక శ్రమలను నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.

బాగా తినాలి

సాధారణంగా జలుబుగా అనిపిస్తే ఆహారం తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏది తినాలని తాగాలని అనిపించదు. కానీ మీరు త్వరగా రోగం నుంచి బయట పడాలంటే మాత్రం బాగా తినాలి. ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలను నివారించడం ఉత్తమం. జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అల్లం, సొంపు గింజలు, ఫుదీనా వంటి సహజ పదార్థాలు వేసి తయారు చేసుకునే హెర్బల్ టీ తాగడం మంచిది. విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం ముఖ్యం. ఐరన్, జింక ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ మూలికలు తీసుకోండి

ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఔషధ గుణాలు కలిగిన కొన్ని మూలికలు వైరస్ లను చంపి జలుబుతో పోరాడేలా సహాయపడతాయి. అందుకే లికోరైస్ రూట్స్, ఎల్డర్ బెర్రీ, వెల్లుల్లి వంటి ప్రసిద్ధ మూలికలు తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యాని ఇస్తాయి. చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

హ్యూమిడిఫైయర్లు

ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు వంటి జలుబు లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు హ్యూమిడిఫైయర్లు సహాయపడతాయి.

సుగంధ ద్రవ్యాలు

జలుబు అద్భుతమైన ఔషధం పసుపు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన పసుపు జలుబుని త్వరగా నయం చేస్తుంది. ఇందులోని కర్కుమిన్ యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. శరీరాన్ని శక్తివంతం చేసి అనారోగ్యాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.

శుభ్రంగా ఉండాలి

జలుబు అంటువ్యాధి. అందుకే జలుబు వచ్చిన వారికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి, తేమ వాతావరణంలో బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పరిసరాల పరిశుభ్రత అవసరం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: అమ్మాయిలూ ఇది విన్నారా? టాయిలెట్ సీట్ కంటే మీ మేకప్ బ్రష్ మీదే బ్యాక్టీరియా ఎక్కువట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget