News
News
వీడియోలు ఆటలు
X

Makeup Brush: అమ్మాయిలూ ఇది విన్నారా? టాయిలెట్ సీట్ కంటే మీ మేకప్ బ్రష్ మీదే బ్యాక్టీరియా ఎక్కువట!

గతంలో టాయిలెట్ సీటు కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీదే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని విన్నారు. అంతేకాదు మేకప్ బ్రష్ మీద కూడా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

మీకోక విషయం తెలుసా.. టాయిలెట్ సీటు మీద కంటే మేకప్ బ్రష్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనని అంటున్నారు నిపుణులు. కాస్మోటిక్ టూల్ బ్రాండ్ స్పెక్ట్రమ్ కలెక్షన్స్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం శుభ్రం చేయని మేకప్ బ్రష్ లో భయంకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని సూచించింది. రెండు వారాల పాటు సాగిన ఈ పరిశోధనాలతో శుభ్రమైన, శుభ్రపరచని మేకప్ బ్రష్ లను పరిశీలించారు. ఈ బ్రష్ లను బెడ్ రూమ్ వానిటీ, మేకప్ బ్యాగ్, డ్రాయర్, బ్రష్ నిర్దిష్ట బ్యాగ్, బాత్రూమ్  హోల్డర్ వంటి అనేక ప్రాంతాల్లో నిల్వ చేశారు. వాటిని పరిశీలించగా టాయిలెట్ సీట్ తో పోలిస్తే బ్యాక్టీరియా బ్రష్ మీద కంటే  ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ఇది ఎలా ప్రభావితం చేస్తుంది?

మేకప్ బ్రష్ బ్యాక్టీరియా డెడ్ స్కిన్ సెల్స్, మొహం నుంచి ఆయిల్ ని తెప్పిస్తాయి. అయితే అన్నీ రకాల బ్యాక్టీరియాయ హానికరం కాదు. డర్టీ బ్రష్ లు ఉపయోగించడం వల్ల మొటిమలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మురికి బ్రష్ లు ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సంఖ్యలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. వ్యాధికారక సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల బ్రేక్ అవుట్, ఇంపెటిగో ఇన్ఫెక్షన్స్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియాని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా మేకప్ బ్రష్ క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

ఎలా చేయాలి?

మేకప్ బ్రష్ లని కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి. సున్నితమైన గుణాలు కలిగిన లిక్విడ్ ని తీసుకోవాలి. ఒక కప్పు నీటిలో 2-3 చుక్కల లిక్విడ్ వేసి వాటిలో బ్రష్ లన్నింటినీ అందులో ఉంచాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వాటిని కడగాలి. బ్రష్ పై మేకప్ ఉత్పత్తి ఏది మిగిలిపోకుండా చూసుకోవాలి. శుభ్రమైన టవల్ తీసుకుని వాటిని ఆరబెట్టుకోవాలి. బ్రష్ లు ఖచ్చితంగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇక ఐలైనర్, పౌండేషన్ బ్రష్ లు (క్రీమ్ ఆధారిత ఉత్పత్తుల కోసం ఉపయోగించేవి) వాడిని ప్రతిసారీ శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పౌడర్ ఆధారిత ఉత్పత్తులకు ఉపయోగించే బ్రష్ లు కూడా త్వరగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ ముళ్ళపై స్ప్రే చేసి ఆపై టిష్యూతో శుభ్రం చేసుకోవచ్చు. ఇక వాటిని సరైన పద్ధతిలో స్టోర్ చేసుకోవాలి. దుమ్ము, ధూళి పడకుండా మూసి ఉన్న కంటైనర్లో వాటిని నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు. మేకప్ బ్రష్ ను శుభ్రమైన జిప్పర్ బ్యాగ్ లో భద్రపరుచుకోవడం ఉత్తమం. ఈ బ్రష్ లను గాలి తగిలే విధంగా బయట వదిలేయడం, డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో పెట్టడం వంటివి చేస్తే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. అందుకే మేకప్ బ్రష్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: వేసవిలో ఎటువంటి రోగాన్నైనా తగ్గించే అద్భుతమైన హోమ్ రెమిడీస్

Published at : 17 Apr 2023 02:55 PM (IST) Tags: Beauty Care Makeup Brush Makeup Brush Cleaning Brush Cleaning

సంబంధిత కథనాలు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు

Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?

Relationships: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?

Mental Illness: ఈ మానసిక రోగాల గురించి ఇంతకుముందు మీరు విని ఉండరు, ఇవి చాలా అరుదైనవి

Mental Illness: ఈ మానసిక రోగాల గురించి ఇంతకుముందు మీరు విని ఉండరు, ఇవి చాలా అరుదైనవి

Screen Time: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Screen Time: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?