Sunscreen for your skin type: వేసవిలో జర భద్రం - మీ చర్మానికి ఏ స్క్రీన్ మంచిదో తెలుసా?
Sunscreen for your skin type: సన్‌స్క్రీన్ కొనే ముందు సన్‌ఎస్‌పిఎఫ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వేడి, కాలుష్యం పెరుగుతున్న సమయంలో ఎంత ఎస్ పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ఎంచుకోవాలో తెలుసుకుందాం.
Sunscreen for your skin type: చర్మంపై ముడతలు, ఫైన్ లైన్‌లు, చర్మం పగుళ్లు, మచ్చలకు యూవీ కిరణాల వల్ల చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడుతుంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉండడం వల్ల చర్మం టాన్ అవ్వడమే కాకుండా తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. యూవీ కిరణాల హానికరమైన ప్రభావం నుంచి మీ చర్మాన్ని రక్షించడంలో సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ వినియోగించకుంటే చర్మం దెబ్బతింటుంది. దీనిని మామూలు స్థితికి తీసుకురావడం కష్టంగా ఉంటుంది. అయితే మనలో చాలా మందికి సరైన సన్ స్క్రీన్ ను ఎంచుకోవడం తెలియదు. మార్కెట్లో చాలా రకాల సన్ స్క్రీన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ వాటిలో మన చర్మానికి ఏది మేలు చేస్తుందో మొదట తెలుసుకోవడం ముఖ్యం. మీ చర్మాన్ని బట్టి సన్ స్క్రీన్ వాడినట్లయితే చర్మం దెబ్బతినకుండా ఉండటంతో పాటు..ఇతర చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ చర్మాన్ని బట్టి మీరు ఎలాంటి సన్ స్క్రీన్ ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్వాలిటీని చెక్ చేయాలి:
సూర్యరశ్మికి గురయ్యేవారు క్వాలిటీని చెక్ చేసుకున్న తర్వాతే సన్ స్క్రీన్ కొనుగోలు చేయాలి. సాధారణంగా ఇందులో రెండు రకాలు ఉంటాయి. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ వంటి పదార్థాలు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. మీ చర్మానికి, సూర్యకిరణాలకు మధ్య అవరోధంగా పనిచేస్తాయి.
బ్రాండ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్‌ను తీసుకోండి:
సన్ స్క్రీన్ కొనుగోలు చేసేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ స్పెక్ట్రమ్ ఎస్పీఎఫ్ ఉన్న క్రీమ్ మీ చర్మాన్ని యూవీఏ, యూవీబీ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. ఇది మీ చర్మాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడటంతోపాటు నల్లమచ్చలు, పిగ్మెంటేషన్, వృద్ధాప్య లక్షణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మీరు సెలక్ట్ చేసుకునే సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ కనీసం 40 ఉండాలి. మీరు ఎలాంటి సన్ స్క్రీన్ సెలక్ట్ చేసుకున్నా దాని ఫార్ములా చాలా తేలికగా ఉండేలా చూసుకోండి. మీ చర్మానికి అదనపు క్రీమ్ ను అప్లయ్ చేసినట్లు అనిపించకూడదు.
మీ చర్మం ఏ రకమైనదో తెలుసుకోవాలి
చాలా మందికి ఎదురుయ్యే సమస్య.. వారి స్కిన్ టైప్ తెలియకపోవడం. తమ చర్మానికి అనుగుణంగా ఎలాంటి సన్ స్క్రీన్ ఎంచుకోవాలనే ప్రశ్నలో వారిలో మొదలవుతుంది. అందుకే మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పొడి చర్మం ఉంటే మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ఉండే మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ ఎంచుకోవాలి. జిడ్డు, మొటిమలు వచ్చే చర్మమైతే.. నీటి ఆధారిత సన్ స్క్రీన్ జెల్ ను కొనుగోలుచేయాలి. ఆల్కహాల్, పారాబెన్స్, సిలికాన్స్, పెర్య్మూమ్స్, మీ చర్మాన్ని మరింత ఇబ్బంది పెడతాయి. సున్నితమైన చర్మం కలవారు వీటికి దూరంగా ఉండటం బెటర్.
Also Read : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.