అన్వేషించండి

Antibiotics: పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇవ్వొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?

చిన్న పిల్లలు అనారోగ్యానికి గురికాగానే ఎక్కువ మంది చేసే పని యాంటీబయాటిక్స్ వినియోగించడం. కానీ అది మంచి ఎంపిక కాదని అంటున్నారు నిపుణులు.

పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా రోగాల బారిన పడతారు. సాధారణంగా జలుబు, జ్వరం, వాంతులు వంటివి చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించే అనారోగ్య సమస్యలు. అవి వెంటనే తగ్గడానికి చాలా మంది తల్లిదండ్రులు ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ పిల్లలకి ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ఉపయోగించకూడదని వైద్యులు సూచిస్తారు. అవి ఎక్కువగా వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు వస్తాయని హెచ్చరిస్తారు. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి పొందేందుకు తగిన మోతాదులో యాంటీ బయాటిక్స్ వినియోగించి చికిత్స చేయవచ్చు. న్యుమోనియా, చెవి, క్షయ, చర్మ సమస్యల వంటి ఇన్ఫెక్షన్స్ కి గురైనప్పుడు యాంటీ బయాటిక్స్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి.

యాంటీ బయాటిక్స్ ఎలా పని చేస్తాయి

బాక్టీరియా, వైరస్‌లు పిల్లలను చాలా అనారోగ్యానికి గురి చేస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రమాదకరమైనవిగా మారతాయి. యాంటీబయాటిక్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇన్ఫెక్షన్స్ కి కారణం అయిన బ్యాక్టీరియా, వైరస్ లను చంపడం, వాటి పెరుగుదల, పునరుత్పత్తిని ఆపడం ద్వారా వాటితో పోరాడతాయి. అయితే యాంటీ బయాటిక్స్ వైరస్ లకి వ్యతిరేకంగా పని చెయ్యవు.

యాంటీ బయాటిక్స్ ఎందుకు సూచిస్తారు?

వైద్యులు సూచించిన అన్ని యాంటీ బయాటిక్స్ లో 50 శాతానికి పైగా అవసరం లేనివే ఎక్కువగా ఉంటాయని అవి అంతగా ప్రభావితం చేయవని ఓ పరిశోధన నివేదిక వెల్లడించింది. యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ కారణంగా ప్రతి సంవత్సరం 23 వేల మంది మరణిస్తున్నారని యూఎస్ కి చెందిన నివేదక పేర్కొంది.

అతిగా వాడటం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు

అలర్జీ: ఓ సర్వే ప్రకారం యాంటీబయాటిక్స్ అతిగా వినియోగించడం వల్ల ఎదురైన దుష్ప్రభావాల కారణంగా అనారోగ్యానికి గురైన వాళ్ళే ఎక్కువగా హాస్పిటల్స్ కి వస్తున్నారట. అందులో ప్రధాన సమస్య అలర్జీ. అతిగా వాడటం వల్ల పిల్లల్లో తేలికపాటి దాద్దుర్లు, చర్మంపై దురద, బొబ్బలు, ముఖం మీద వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అతిసారం: చాలా మంది పిల్లలు యాంటీబయాటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల  డయేరియాతో బాధపడుతున్నారు. సరైన చికిత్స అందించకపోతే ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది.

యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ ఇన్ఫెక్షన్లు చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తారు. వాటికి చికిత్స చెయ్యడం కూడా కష్టంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకి సాధారణంగా జ్వరం వచ్చిన వెంటనే యాంటీ బయాటిక్స్ ఉపయోగించకుండా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాటిని వాడుకోవడం మేలు. ప్రతి తల్లి దండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా నిరోధకతకు దారి తీస్తుంది.

Also Read: ఉప్పుతో ఊబకాయం ముప్పు? అతిగా తింటే అనారోగ్యాలు తప్పవా?

Also Read: రోజులో 23 గంటలు బెడ్ మీదే, ఏం తిన్నా వాంతులే - ఈమెకు వచ్చిన వింత వ్యాధి ఏమిటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Tips : బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట
బరువు తగ్గాలా? కఠినమైన డైట్ వద్దు, ఈ చిన్న మార్పులు చాలు అంటోన్న హెల్త్ కోచ్.. వీటితో పది కిలోలు తగ్గిందట
Solo Travel Safety Tips : సోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ తప్పులు చేయకండి.. తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే
సోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ తప్పులు చేయకండి.. తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Embed widget