అన్వేషించండి

రోజులో 23 గంటలు బెడ్ మీదే, ఏం తిన్నా వాంతులే - ఈమెకు వచ్చిన వింత వ్యాధి ఏమిటో తెలుసా?

రోజుకి 23 గంటలు మంచం మీదే ఉండాలి, లేచి నిలబడలేని పరిస్థితి. ఈ వింత వ్యాధితో పోరాడుతోంది ఈ 28 ఏళ్ల మహిళ. అయినా తన వ్యాధి గురించి భయపడకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోంది.

ఆమె రోజుకి 23 గంటలు కదల్లేని స్థితిలో మంచం మీదే ఉంటుంది. రోజుకు కనీసం 10 సార్లు వాంతులు, మూర్చలు రావడంతో నరకం చూస్తోంది. ఆమెకు వచ్చిన వింత వ్యాధి గురించి తెలుసుకోడానికి ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. కానీ, వైద్యులు స్పష్టంగా ఆమెకు వచ్చిన వ్యాధి గురించి చెప్పలేకపోయారు. దీంతో ఆ మహిళే తన వ్యాధికి పేరు పెట్టుకుంది. అదే ‘అలర్జీ ఆఫ్ గ్రావిటీ’. కనీసం రెండు నిమిషాలు కూడా నిలబడలేని దయనీయమైన దుస్థితి ఆమె.

అమెరికాకు చెందిన 28 ఏళ్ల లిండీ జాన్సన్ ఒకప్పుడు యూఎస్ నేవీలో పనిచేసేది. కానీ, ఇప్పుడు ఆమె ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. ప్రపంచంలోనే అతి తక్కువ మంది అర్థం చేసుకునే వ్యాధిగా దీన్ని చెప్పుకొస్తున్నారు. ఆమె కనీసం మూడు నిమిషాలు కూడా నిలబడలేదు, అందరిలా కాళ్ళు చాపి కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు. 2015 లో జాన్సన్ పొత్తికడుపు, వెన్నునొప్పి వచ్చింది. సంవత్సరాలు గడిచే కొద్ది ఆమెలో ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోజుకి కనీసం 10 సార్లు  విపరీతంగా వాంతులు చేసుకోవడం, మూర్ఛపోవడం జరిగింది. కొన్నేళ్ళ పాటు వైద్యుల చుట్టూ తిరిగిన తర్వాత 2022లో ఆమెకి ఆర్థోస్టాటిక్ టాచికార్డియా సిండ్రోమ్(PoTS) వచ్చినట్లు నిర్ధారించారు.

ఈ అరుదైన వ్యాధి వచ్చిన వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గి హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది. జాన్సన్ తన వ్యాధికి ‘అలర్జీ ఆఫ్ గ్రావిటీ’గా పేరు పెట్టారు. ఆమె మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలబడలేదు. మంచం మీదే రోజంతా గడపాల్సి వస్తుంది. తన పరిస్థితి గురించి చెప్తూ బాధపడింది. ‘ఇకపై నేను ఇంటి నుంచి బయటకి ఎక్కడికి వెళ్లలేను. నా సొంత పనులు కూడా లేచి చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను’ అని చెప్పుకుని చాలా ఆవేదన పడ్డారు.  

‘‘అనారోగ్యం కారణంగా నేవీ నుంచి 2018లో బయటకి వచ్చాను. నొప్పితో చాలా అల్లాడిపోయేదాన్ని. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను. కానీ ఎవరు నాకు వచ్చిన వ్యాధి ఏమిటనేది గుర్తించలేకపోయారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడం, వాంతులు, మూర్ఛ పోవడం వంటి సమస్యలతో బాధపడేదాన్ని. 2022లో నా పరిస్థితి మరింత దిగజారింది. వంగడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. తర్వాత నన్ను పరిశీలించిన కార్డియాలజిస్ట్ నాకు PoTS ఉందని అనుమానించి పరీక్షలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాకు ఆ వ్యాధి ఉన్నట్టు వైద్యపరంగా నిర్ధారించారు. ఇప్పటికైనా నాకు వచ్చిన వ్యాధి ఏమిటో గుర్తించగలిగారు. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం జాన్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉండి ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స వల్ల ఇప్పుడు తన పరిస్థితి మెరుగుపడింది. అయినప్పటికీ తను అందరిలాగా సాధారణ జీవితం గడపలేదు. తన భర్త జేమ్స్ మీదే అన్నిటికీ ఆధారపడి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ జాన్సన్ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు బెడ్ మీదే ఉంది డిగ్రీ చేస్తోంది. తన ఉద్యోగంలో మళ్ళీ చేరి ఇంటి నుంచి పని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.    

Also Read: పచ్చి అల్లం VS సొంటి పొడి, ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలేమిటీ?

Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారా? అవి ప్రాణాంతక వ్యాధులకు సంకేతం కావచ్చు

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget