Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి
మన శరీరానికి 13 రకాల విటమిన్స్ అవసరం. సాధరణంగా విటమిన్స్ అనగానే ఏ, సి, ఇ, డి, బి మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ, కనిపించని ఆ కే2 విటమిన్ గురించి మీకు తెలుసా?
మన శరీరానికి 13 రకాల విటమిన్స్ అవసరం. సాధరణంగా విటమిన్స్ అనగానే ఏ, సి, ఇ, డి, బి మాత్రమేఎక్కువగా వినిపిస్తాయి. విటమిన్ K2 గురించి త్వరగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ అది కూడా శరీర పనితీరు విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె, ఎముకల ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ K2 చాలా ముఖ్యమైనది. ఇది రక్తం గడ్డ కట్టేందుకు, క్యాన్సర్ తో పోరాడేందుకు ఇది బాగా దోహదపడుతుంది. మాంసకృతులు, బలవర్ధకమైన ఆహారం ద్వారా విటమిన్ K2 శరీరానికి అందుతుంది. మనల్ని ఆరోగ్యవంతంగా చేయడంలో దీర్ఘకాలంగా సహాయపడుతుంది, ఎముకల వ్యాధి, గుండె జబ్బులు, దంత సమస్యలు మొదలైన అనేక అనారోగ్య సమస్యలను K2 నివారిస్తుంది.
విటమిన్ K2 లాభాలు
మన దంతాలకు ఏది మంచిది, మన శరీరానికి ఏది మంచిది అనేది విటమిన్ K2 నిర్ణయిస్తుంది. దంత సంబంధ వ్యాదులని ఇది నివారిస్తుంది, ఎముకలను బలంగా చెయ్యడంలో సహాయపడుతుంది. చర్మం మీద వచ్చే ముడతలను నివారించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. వ్యాయామ పనితీరుని మెరుగుపరుస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్ళను కరిగించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. విటమిన్ K2 మీ మెదడు పనితీరుతో పాటు చర్మ ఆరోగ్యానికి, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
ఏయే పదార్థాలలో లభిస్తుంది
జున్ను, చికెన్, గొడ్డు మాంసం కాలేయం, వెన్న, బచ్చలికూర, బ్రకోలీ, అవకాడో, బఠానీలు, కోడిగుడ్డులో విటమిన్ K2 అందె ప్రాథమిక ఆహారాలు. సప్లిమెంట్స్ ద్వారా కూడా ఈ విటమిన్ పొందవచ్చు. పులియబెట్టిన ఆహారాలు, పాలు, తృణధాన్యాలు, నాన్-డైరీ పాలు వంటి బలవర్ధకమైన ఆహారాలు విటమిన్ K2ని అందించే మంచి ఆహార పదార్థాలు.
విటమిన్ కే 2 లోపం లక్షణాలు
విటమిన్ K2 లోపాన్ని సూచించే లక్షణం చర్మంలోని గాయాలు, ముక్కు నుంచి రక్తస్రావం, ప్రేగులలోకి రక్తస్రావం. దీని కారణంగా రక్తపు వాంతులు అయ్యే అవకాశం ఉంది. మూత్రం, మలంలో కూడా రక్తం పడుతుంది. విటమిన్ K2 లోపం ఎముకలను బలహీనపరుస్తుంది. దాని వల్ల సులభంగా ఎముకలకు గాయాలు అవుతాయి.
విటమిన్ K2 ఎక్కువైతే వచ్చే నష్టాలు
తగిన జాగ్రత్తలు పాటించి ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కలగవు. చూపు మందగించడం, గుండె బరువుగా అనిపించడం, దగ్గు, చెమటలు పట్టడం, చర్మం పై దద్దుర్లు, అరచేతులు, గోళ్ళు నీలం లేదా పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటివి కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి
Also Read: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!