Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి
నీరు శరీరానికి ఎంతో అవసరం. శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. మనం డీహైడ్రేట్ అవకుండా ఉండటానికి వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి.
నీరు శరీరానికి ఎంతో అవసరం. శరీర పనితీరు సక్రమంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. మనం డీహైడ్రేట్ అవకుండా ఉండటానికి వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి. లేదంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది. తద్వారా నీరసం వచ్చేస్తుంది. మనలో చాలా మంది అన్నం తినే మధ్యలో నీరు తాగుతూ ఉంటారు. కొంతమందికి అయితే నీళ్ళు తాగకపోతే ముద్ద కూడా దిగదు. మనం నోటితో ఆహారం తీసుకున్నప్పుడే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఆహారం కడుపులోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ట్రిక్ రసాలు జీర్ణక్రియ కోసం వాటిని విచ్చిన్నం చేస్తాయి. మనం అన్నం మధ్యలో నీటిని తాగడం వల్ల ఆ ప్రక్రియకి ఆటంకం కలుగుతుంది.
భోజనం ముందు నీటిని తాగొచ్చు. కానీ తినేటప్పుడు మాత్రం మంచిది కాదని అంటున్నారు వైద్య నిపుణులు. అలా నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, తేన్పులు, వికారం వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే భోజనం మధ్యలో నీటిని తాగడం మంచిది కాదని చెప్తున్నారు.
ఎంజైమ్ లకు పనీతిరుకి ఆటంకం
ఆహారం అరుగుదలకి ఉపయోగపడే ఎంజైమ్ ల పనీతిరుకి ఇది ఆటంకం కలిగిస్తుంది. తినేటప్పుడు నీరు తాగడం వల్ల ఆ ఎంజైమ్ లు నశించిపోతాయి. దాని వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, పుల్లటి తేన్పులు వస్తాయి.
ఇన్సులిన్ పెంచుతుంది
భోజనంతో పాటు నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అది శరీరంలో కొవ్వు నిల్వ చేసే అవకాశాలను పెంచుతుంది.
బరువు పెరుగుతారు
తినే సమయంలో ఎక్కువగానీరు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జీర్ణం కానీ ఆహారం కొవ్వుగా మారుతుంది. దాని వల్ల బరువు పెరుగుతారు.
భోజనం మధ్యలో నీరు తాగడం మానేయడం ఎలా?
ఉప్పు తక్కువ తీసుకోవాలి: ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. దాని వల్ల నీరు తాగాలనే ఆలోచన రాదు. సోడియం ఎప్పుడు దాహాన్ని కలిగిస్తుంది.
ఆయిల్, స్పైసీ ఫుడ్ తగ్గించాలి: ఆయిల్, మసాలా తక్కువగా వేయడం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది. తక్కువ నూనె దాహాన్ని ప్రేరేపించవు.
ఎక్కువగా నమలాలి: మీరు ఎంత ఎక్కువగా ఆహారం నమిలితే.. జీర్ణక్రియ అంత వేగంగా సాగుతుంది. అప్పుడు గ్యాస్ సమస్యలు దరిచేరవు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.