Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
జెండా పండుగ రోజు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయానలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే ఇంటిపై మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది. దేశభక్తిని చాటేందుకు తమ ఇళ్లపై తివ్రర్ణపతాకాన్ని ఎగురవేస్తారు ఎంతో మంది ప్రజలు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సింది ఫ్లాగ్ కోడ్ గురించి. కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి.
ఫ్లాగ్ కోడ్‌ను అనుసరించండి...
1.జెండాను ఒకప్పుడు ఖాదీ వస్త్రంతోనే తయారు చేసేవారు. ఇప్పుడు పాలిస్టర్‌తో చేసినవి కూడా అనుమతిస్తున్నారు.
2. జాతీయ జెండాను ఎగురవేశాక, ఆ జెండా కన్నా ఎత్తులో ఇతర ఏ జెండా ఉండకుండా చూసుకోవాలి. అది దేవుడినిక సంబంధించినదైనా కూడా జాతీయ జెండా కన్నా తక్కువ ఎత్తులోనే ఉండేట్టు చూసుకోవాలి.
3. చిరిగిపోయిన, నలిగిపోయిన జెండాను ఎగురవేయకూడదు.
4. జెండాలో కాషాయరంగు పైకి ఉండేలా చూసుకోండి. చాలా మంది అవగాహన లేక కాషాయరంగును కిందకి ఉండేలా ఎగురవేస్తున్నారు.
5. జెండా అనేది మనదేశ ఆత్మగౌరవానికి సంబంధించినది దీన్ని అలంకరణ వస్తువుగా ఎగురవేయకండి.
6. ఇంటిపై ఎగురవేయచ్చని అనుమతి ఇచ్చారు అంటే... గౌరవప్రదమైన స్థానంలోనే ఎగురవేయాలి. కానీ బాత్‌రూమ్ వంటి స్థానాల్లో ఎగురవేయకూడదు.
7. జెండాను అతిగా అలంకరించడం కోసం, పూలు తగిలించడం వంటివి చేయకండి.
8. జెండాను మిగతా వస్త్రాల్లా చేతులు తుడుచుకునేందుకు, ఏవైనా వస్తువుల మీద కప్పేందుకు ఉపయోగించకూడదు.
9. జెండాలపై ఏమీ రాయకూడదు.
10. జెండాలను ఎగురవేసేందుకు లోపల పువ్వులు కట్టి ఎగురవేయచ్చు.
11. జాతీయ జెండా నేలపై పడేయకూడదు. నీటిలో పడేయకూడదు.
12. జెండాను కర్ఛీఫ్‌లా ఉపయోగించకూడదు.
13. జాతీయ జెండాను కర్ర చివరనే కట్టాలి. మధ్యలో కట్టకూడదు.
అహింసాయుత పోరాటంతో స్వాతంత్య్రాన్ని పొందిన దేశం మనదే. అందుకే మన దేశం ఎంతో ప్రత్యేకం. క్విట్ ఇండియా ఉద్యమంతో తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి, వారిని దేశం విడిచి వెళ్లేలా చేశారు. స్వాతంత్య్రానికి సాక్ష్యంగా ప్రతి ఏడాది ఆగస్టు 15న జాతీయపతాకాన్ని ఎగురవేస్తాం. దీని పొడవు వెడల్పులు కచితంగా 2:3 నిష్పత్తిలో ఉండాలి. మధ్యలో ఉన్న అశోక చక్రతం ధర్మానికి ప్రతీక.
Also read: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు