News
News
X

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

తేనె చాలా ఆరోగ్యప్రదాయిని, నిజమే కానీ ఇందులో మరో రకం ఉంది. దాన్ని తాగితే మామూలుగా ఉండదు.

FOLLOW US: 

సాంప్రదాయ తేనె అందరికీ తెలిసిందే. దీన్ని రోజుకో స్పూను తాగడం వల్ల చాలా ఆరోగ్యం కూడా. అయితే ఇందులోనే మరో రకం తేనె ఉంది. నిజానికి ఇది అధికంగా నేపాల్‌లోనే దొరుకుతుంది. మిగతా చోట్ల దొరకదు కాబట్టి ఈ వెరైటీ తేనె గురించి ఎవరికీ తెలియదు. దీన్ని ‘మ్యాడ్ హనీ’ అంటారు. అంటే పిచ్చెక్కించే తేనె అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన తేనె రకాల్లో మ్యాడ్ హనీ ఒకటి. నేపాల్ ప్రజలు చాలా ఏళ్లుగా దీన్ని ఔషదంగా ఉపయోగిస్తున్నారు. అయితే సాధారణ తేనెకు భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. తాగితే చేదుగా, గొంతులో చికాకుగా అనిపిస్తుంది. 

ఎలా తయారవుతుంది?
2018లో ఈ మ్యాడ్ హనీపై అధ్యయనం నిర్వహించారు. దీన్ని క్రీస్తుపూర్వం 2100 నుంచి నేపాల్ లో ఉపయోగిస్తున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది. దీన్ని పూర్వకాలం నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ తేనెలో గ్రేయనోటాక్సిన్స్ అని పిలిచే మత్తును కలిగించే విషపూరితమైన పదార్థం కలుస్తుంది. ఈ మత్తు పదార్ధం రోడోడెండ్రాన్ జాతి మొక్కలకు పూసే పూల పుప్పొడిలో లభిస్తుంది. ఆ పూల నుంచి తేనెను గ్రహించిన తేనెటీగల వల్ల ఇలాంటి మ్యాడ్ హనీ తయారవుతుంది. ఈ తేనెను మితంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. అలాగే లైంగిక శక్తిని పెంచుతుంది. అజీర్తి, పొట్టలో పుండ్లు, పుండ్లు వంటివి తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలం పాటూ మితంగా తాగితే అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

టర్కీలో కూడా...
నేపాల్‌లో ఇప్పటికీ దీన్ని ఔషధంగానే ఉపయోగిస్తున్నారు.   ఇది నేపాల్ లో అధికంగా దొరుకుతున్నప్పటికీ టర్కీలోని బ్లాక్ సీ ప్రాంతంలో ఉన్న తేనెటీగలు కూడా ఇలాంటి మ్యాడ్ హనీ తేనెపట్టును కడుతున్నాయి. అంటే అక్కడ కూడా రోడోడెండ్రాన్ జాతి మొక్కలు ఉండి ఉంటాయి. 

ప్రాణాంతకమే...
ఈ తేనె మద్యం కన్నా ఎక్కువ కిక్కును ఎక్కిస్తుంది. రోజుకు మితంగా అరస్పూను తాగితే చాలు. అతిగా తాగితే మాత్రం మత్తెక్కిపోతుంది. ఊహాలోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. అనేక భ్రాంతులు కలగడం మొదలవుతుంది. మైకంగా అనిపిస్తుంది. ఆ మైకంలో చాలా ఆనందం కలుగుతుంది. మోతాదు పెరిగితే వాంతులు, వికారం, మూర్ఛ సంభవిస్తుంది. అలాగు గుండె కొట్టుకునే వేగం మారిపోయి అరిథ్మియా వంటి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అరుదుగా మరణాలు కూడా సంభవించవచ్చు. 

ఈ తేనె కోసం విదేశీయులు ఎంతో మంది ప్రత్యేకంగా నేపాల్ వస్తారు. దాన్ని ఔషధంగా భావించి తమతో తీసుకెళతారు. తక్కువ మోతాదులో తాగుతూ ఆరోగ్యసమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ తేనెపై ఎన్నో అంతర్జాతీయ టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేశాయి. నేపాల్ కే దక్కిన తేనె రకం ఇది. 

Also read: ప్రపంచాన్ని ఏలుతున్న అయిదు భాషలు ఇవే, ఒక్కో భాషని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసా?

Also read: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం

Published at : 10 Aug 2022 10:03 AM (IST) Tags: Mad Honey Dangerous Honey Benefits of Honey Honey Alcohol

సంబంధిత కథనాలు

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

Potatoes: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Lumpy Skin Disease : లంపి స్కిన్ డిసీజ్ మనుషులకు వ్యాపిస్తుందా? ఆ వైరస్ లక్షణాలు ఏంటి?

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

Diabetes: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?