అన్వేషించండి

Oropouche Fever: దోమ కాటుతో వచ్చే ఈ కొత్త జ్వరం గురించి విన్నారా? ఇది డెంగ్యూ కంటే డేంజరా?

దోమ కాటుతో వ్యాపించే మరో విష జ్వరం కొత్తగా వ్యాపిస్తోందట. ఈ వ్యాధి ఇదివరకు కనిపించనచి దేశాల్లో సైతం వ్యాపించడం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మరి ఆ వ్యధి వివరాలు తెలసుకోవడం అవసరం.

దోమలతో వచ్చే వ్యాధులు ఏమిటని అడిగితే.. వెంటనే డెంగ్యూ, మలేరియా అని చెప్పేస్తాం. అయితే, ఇప్పుడు మార్కెట్లోకి కొత్త మస్కిటో డిసీజ్ వచ్చింది. ఇప్పటికే అది పలు దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఆ కొత్త దోమకాటు వ్యాధి పేరు ‘ఓరోపౌచ్’

ఇటలీలో ఈ నెలలోనే లాటిన్, దక్షిణ అమెరికాలో ఒరోపౌచ్ జ్వరానికి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. ఇది దోమల వల్ల వ్యాపించే వ్యాధి. జూన్ 15న ఐరోపా ఖండంలో ఇటలీ దేశంలో మొదటి ఓరోపౌచ్ ఫీవర్ కేస్‌ను నిర్ధారించారు. లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో ఇప్పటికే ఈ జ్వరాలు వ్యాప్తిలో ఉన్నాయట. ఇటలీలో ఈ వ్యాధినిర్ధారణ జరిగిన రోగి కూడా ఇటీవల కరేబియన్ పర్యటన నుంచి తిరిగి వచ్చినట్టు అక్కడి ప్రజారోగ్య అధికారులు నిర్ధారించారు.

ఈ వ్యాధి ఓరోపౌచ్ వైరస్ సోకిన మిడ్జెస్, దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. దక్షిణ అమెరికా, కరేబియనలలో ఈ వ్యాధి చాలా కాలంగా వ్యాపిస్తున్నప్పటికీ ఈ ఏడాది కొన్ని దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి పెరిగినట్టు గుర్తించారు. ఇదివరకు ఎన్నడూ ఈ వ్యాధి వ్యాపించని దేశాల్లో సైతం కేసులు నమోదవుతున్నాయట. కనుక దీని గురించిన అవగాహన కలిగి ఉండడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

 ఓరోపౌచ్ వైరస్ లక్షణాలు

ఒరోపౌచ్ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మనిషి నుంచి మనిషికి సంక్రమించిన ఆధారాలు ఇప్పటి వరకు లేవు. ఈ జ్వర లక్షణాలు డేంగ్యూ మాదిరిగానే ఉంటాయి. వైరస్ శరీరంలో చేరిన నాలుగు నుంచి ఎనిమిది రోజుల మధ్య లక్షణాలు ప్రారంభం అవుతాయి. జ్వరం, తలనొప్పి, చలి, కీళ్లు బిగుసుకోవడం, కీళ్లలో నొప్పి, కొన్ని సార్లు వికారం, వాంతులు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఏడు రోజుల పాటు ఈ బాధలు వేధిస్తాయి. తర్వాత కోలుకుంటారు. ఈ జ్వరం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, కానీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెంగ్యూతో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాదని, కానీ వైరల్ ఫీవర్ వల్ల శరీరంలో కలిగే మార్పులు, అనారోగ్య పరిస్థితుల గురించి ఇంకా స్టడీ చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధికి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. యాంటీ వైరల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పెద్దగా అవగాహన లేని ఈ వైరల్ ఫీవర్ గురించి సమాచారం పెద్దగా అందుబాటులో లేదని 2023 మే నెలలో జర్నల్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ ఆఫ్ ప్రాపర్టీలో ప్రచురితమైన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అందువల్ల ఈ వ్యాధి ఎపిడమిక్ పొటెన్షియల్ గురించిన పెద్దగా సమాచారం తెలియదనే చెప్పాలి.

పర్యావరణ పరిస్థితులు ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్పష్టమైన నిరూపణలు లేకపోయినప్పటికీ అడవులు తగ్గిపోవడం, వృక్షసంపదకు కలుగుతున్న నష్టం ఈ వ్యాధి వ్యాప్తికి కారణం కావచ్చని అనుకుంటున్నారు.

Also Read : Nebuliser: నెబ్యులైజర్ నిజంగా ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్‌ను నయం చెయ్యగలదా? దేనికి వాడాలి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget