అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nebuliser: నెబ్యులైజర్ నిజంగా ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్‌ను నయం చెయ్యగలదా? దేనికి వాడాలి?

సమంత హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యూలైజేషన్ గురించి చేసిన పోస్ట్.. వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. మరి హైడ్రోజన్ పేరాక్సైడ్ పీల్చడం ఎంత వరకు మంచిది? డాక్టర్లు ఏమంటున్నారు?

హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యూలైజేషన్ అంటే ఏమిటి?

నెబ్యూలైజర్ ను ఆస్తమా వంటి శ్వాససంబంధ వ్యాధులకు ఉపయోగించే శ్వాస యంత్రంగా చెప్పవచ్చు. కోవిడ్ సమయంలో వీటిని విరివిగా ఉపయోగించారు. అప్పుడే హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యూలూజేషన్ కూడా ప్రాచూర్యంలోకి వచ్చింది. అయితే ఆస్తమా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (AAFA) ఇలా హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యూలైజేషన్ ప్రమాదకరం అని హెచ్చరికలు కూడా చేసింది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ ను క్లీనర్ గా స్టియన్ రిమూవర్ గా ఉపయోగిస్తారు. దానిని నోటి ద్వారా తీసుకున్నా, శ్వాసద్వారా పీల్చినా కూడా కణజాలాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మామూలుగా ఇంట్లో వాడేందుకు అందుబాటులో ఉండే హైడ్రోజన్ పెరాక్సైడ్‌లో కేవలం 3 శాతం మాత్రమే గాఢత ఉంటుంది. అలాంటి దాన్ని శ్వాస ద్వారా తీసుకున్నా కూడా శ్వాసవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తవచ్చట. ఇది కంటి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. 10 శాతం కంటే ఎక్కువ గాఢత కలిగిన ద్రావణాల ఆవిరి పీల్చడం వల్ల తీవ్రమైన శ్వాస సంబంధ అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంటుంది.

డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సమంతా ప్రమాదకరమైన చికిత్స ను ప్రమోట్ చేస్తున్నారని, అది సరైన విధానం కాదని ఆమె పోస్ట్ ను ఖండించారు. మెడిసిన్ చదువుకోని ఒక సామన్య నటి ఇలా తప్పుడు వైద్య సలహాలు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు.

ఆ తర్వాత సమంత కూడా దీనిపై స్పందించింది. దీనిపై చర్చించి ఉంటే బాగుండేదని పేర్కొంది. దీంతో ఆ డాక్టర్ కూడా సమంతకు క్షమాపణలు చెప్పారు. సమంత మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యూలైజేషన్ గురించి మంచి ఉద్దేశంతోనే సూచించానని, తనకు డాక్టర్ సూచించిన చికిత్సా విధానాన్నే పోస్ట్ చేశానని పేర్కొంది.

దీనికి సమాధానం చెబుతూ డాక్టర్ అబ్బి ఫిలిప్స్.. ఆమెను తీవ్రంగా తప్పు పట్టారు. ఆమెను నేరస్తురాలిగా అభివర్ణించారు. తీరిక లేకుండా పని చేస్తున్న తన వంటి  డాక్టర్లు ఆన్లైన్ లో తప్పుడు సమాచారాన్ని అందించడానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తప్పకుండా సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఏమాత్రం వైద్య పరిజ్ఞానం లేని ప్రముఖులు ఇచ్చే ఇలాంటి సమాచారాన్ని తప్పక వ్యతిరేకించాలని డాక్టర్ ఫిలిఫ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గాను ఆమెకు శిక్ష విధించాలని చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. డాక్టర్ క్షమాపణతో ప్రస్తుతం ఈ వివాదానికైతే తెరపడింది. అయితే, డాక్టర్ సలహా లేకుండా మీరు ఎలాంటి సొంత చికిత్సను అనుసరించవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే సలహాలను అస్సలు పాటించవద్దు.

Also Read : Tattoo Side effects: టాటూ వేయించుకోడానికి ఉత్సాహంగా ఉన్నారా? మరోసారి ఆలోచించండి ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే?

మనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget