Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు
Friendship Day: ఫ్రెండ్‌షిప్‌ని ఎవరూ "ఇది" అని డిఫైన్ చేయలేరు. కొన్ని రిలేషన్స్‌ని అనుభూతి చెందటమే బెటర్.
Friendship Day 2022:
డిఫైన్ చేయలేమండి బాబూ..
కొన్ని రిలేషన్స్‌ని డిఫైన్ చేయటం ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకునే బదులు, వాటిని ఫీల్ అవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్...దేవుడి గురించి మాట్లాడుకుందాం. దేవుడు అంటే ఏంటి..? అనే ప్రశ్నకు కొన్ని వందలు, వేల సమాధానాలొస్తాయి. అందులో ఏదీ ఇంకో ఆన్సర్‌తో మ్యాచ్ అవదు. సో ఎవరికి వాళ్లు "దేవుడు" అనే కాన్సెప్ట్‌ని ఓన్ చేసుకుని వాళ్లకు అర్థమైంది చెబుతారు. ఇదే ఫార్ములా ప్రేమకు, స్నేహానికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్‌షిప్ డే కాబట్టి...ప్రస్తుతానికి స్నేహం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. "స్నేహం" అంటే ఏంటి అంటే కూడా ఇలా వందల కొద్ది ఆన్సర్‌లు వస్తాయి. సో... "స్నేహమంటే ఇదేరా" అని సినిమా టైటిల్‌గా మనం జస్టిఫికేషన్ ఇవ్వలేం.
ఫ్రెండ్ అంటే ప్యూరిటీ
మీ దృష్టిలో ఫ్రెండ్ అంటే ఎవరు అని పోల్ ఒకటి పెడితే "వాడంత నీచ్ కమీనే గాడు ఇంకోడు ఉండడు" అని ఒకడు "అర్జున్ రెడ్డి" ఫార్మాట్‌లో
చెబుతాడు. మరొకడు "వాడు అన్నింట్లోనూ బెస్టే" అని "స్నేహం కోసం" స్టైల్‌లో చెబుతాడు. మనం స్వచ్ఛమైన ప్రేమ, అచ్చమైన ప్రేమ అని కవిత్వాలు చెప్పుకుంటాం కదా. దీనికో ఉదాహరణ చెప్పుకుందాం. సాధారణంగా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు ముందు కోనేరులో స్నానం చేస్తాం. గర్భ గుడిలోకి వెళ్లే ముందు స్వచ్ఛంగా ఉండాలని, ఇలా అరేంజ్‌మెంట్స్ చేశారు. ముస్లింలు కూడా మసీదులోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు తమదైన పద్ధతిలో శుభ్రం చేసుకుంటారు. ఇతర మతాల్లోనూ ఈ ఆచారం ఉంది. ఈ కాన్సెప్ట్‌ని...లవ్, ఫ్రెండ్‌షిప్‌కి ఓన్ చేసి చూద్దాం.
పడిపోతానేమో అన్న ఆలోచన కూడా రానివ్వడు..
మళ్లీ మనం "స్వచ్ఛమైన ప్రేమ" గురించి మాట్లాడుకుందాం. నీలో అంత ప్యూరిటీ రావాలంటే...కచ్చితంగా నిన్ను నువ్వు "స్వచ్చంగా" మార్చుకోవాలి. నిన్ను ఇలా మార్చేదే ఫ్రెండ్‌షిప్. సింపుల్‌గా చెప్పాలంటే స్నేహం "కోనేరు"లాంటిదన్నమాట. నీకు ప్యూర్ లవ్ దొరకాలంటే...ఫస్ట్ నువ్వు ప్యూర్‌గా ఉండాలి కదా. సో అందుకే...నీకు "స్నేహం" అవసరం. అఫ్‌కోర్స్ "ప్రతి ఫ్రెండ్ అవసరమేరా" అని పాడుకోవచ్చు. కానీ..."అవసరం కోసం మాత్రమే ఫ్రెండ్ కాదు". నువ్వు పడిపోతే చేయి పట్టుకుని పైకి లేపే వాళ్లు ఉండటం అదృష్టమే.
కానీ..అసలు "పడిపోతానేమో" అని ఆలోచన కూడా రానివ్వకుండా సపోర్ట్ చేయటం అద్భుతం కదా. అలాంటి అద్భుతాలెన్నో ఉంటాయ్ ఫ్రెండ్‌లో. అల్లాద్దీన్ అద్భుత దీపం కథ తెలిసే ఉంటుందిగా. అలాంటోడన్నమాట స్నేహితుడు.
Happy Friendship Day
మీ ఫ్యామిలీ ఎప్పుడూ "మా వాడు బుద్ధిమంతుడు" అనే అనుకుంటుంది. కానీ నువ్వెన్ని వెధవ వేషాలు వేస్తావో వాళ్లకు తెలియదు. నీలోని స్టుపిడిటీ ఏంటన్నది నీపక్కనే ఉండో దోస్తుగాడికి మాత్రమే తెలుస్తుంది. అందుకే అంటారుగా "నీ ఫ్రెండ్ ఎవరో చూపించు, నువ్వెలాంటోడివో చెప్పేస్తాం" అని. ఎందుకంటే "అసలైన నువ్వు" తెలిసేది ఫ్రెండ్‌కి మాత్రమే. అదన్నమాట మ్యాటర్. అందరికీ ABP Desam తరపున "Happy Friendship Day".