అన్వేషించండి

Foot Hand Mouth Disease: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!

నోటిపూతతోపాటు మీ చేతులు, కాళ్లు ఇలా మారుతున్నాయా? అయితే, మీరు తప్పకుండా డాక్టర్‌‌ను సంప్రదించండి.

‘మౌత్-హ్యాండ్-ఫుట్’ అనే ఈ వ్యాధి గురించి మీకు తెలుసా? ఇది నోరు, చేతులు, పాదాలకు వచ్చే ఈ వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. సాధారణంగా పిల్లలకు వచ్చే ఈ వ్యాధి పెద్దల్లో కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 

‘మౌత్-హ్యాండ్-ఫుట్’ వ్యాధి ఒక సాధారణ ఇన్ఫెక్షన్. ఇది ఇతరులకు కూడా సోకే అవకాశం ఉంది. మీకు ఎప్పుడైనా ఒకేసారి నోటిపూత, కాళ్లు, చేతులపై మచ్చలు ఏర్పడినట్లయితే.. అది కచ్చితంగా ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ వ్యాధిగా పరిగణించాలి. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి.. ఇప్పుడు పెద్దలను వదలడం లేదట.  
                 
లక్షణాలు ఇవే: ఈ వ్యాధికి గురైన మూడు నుంచి ఐదు రోజుల తర్వాతే లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ కింది లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.  

ముందుగా కనిపించే లక్షణాలు:
⦿ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది
⦿ ఆకలి వేయదు
⦿ కడుపు నొప్పి
⦿ గొంతు, నోరు నొప్పి
⦿ దగ్గు

వ్యాధి ముదిరిన తర్వాత కనిపించే లక్షణాలు:

నోటిలో పుండ్లు: వ్యాధి ఏర్పడిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత నాలుకపై, నోటి లోపల ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి నోటి పూతల తరహాలోనే ఉంటాయి. ఇవి చాలా బాధిస్తాయి. ఆహరం తీసుకోవడం కష్టమవుతుంది. కనీసం నీళ్లు కూడా తాగలేరు. ఈ సమస్య సుమారు ఒక వారం రోజులు వరకు ఉండవచ్చు.  

దద్దుర్లు, పొక్కులు: నోటి పూతలు కనిపించిన తర్వాత, చిన్న ఎర్రటి మచ్చలతో దద్దుర్లు చర్మంపై కనిపిస్తాయి. చేతి వేళ్లు, చేతి వెనుక, అరచేతులు, పాదాల అరికాళ్లపై ఈ మచ్చులు కనిపిస్తాయి. ఈ మచ్చలు క్రమేనా బూడిద రంగులో బొబ్బలుగా మారవచ్చు. ఈ బొబ్బలు కొన్నిసార్లు దురదగా, మంటగా ఉంటాయి. చికాకు కలిగిస్తాయి. సుమారు 10 రోజుల వరకు ఇవి ఉంటాయి.

చికిత్స లేదు, నివారణ సాధ్యమే: ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స ఏమీ లేదు. కానీ, వైద్యులు రాసిచ్చే మందుల వల్ల వ్యాధి తీవ్రం కాకుండా అరికట్టవచ్చు. ఆ కోర్సును వాడితే క్రమేనా వ్యాధి తగ్గుముఖం పట్టవచ్చు. ఈ వ్యాధి సోకితే మీరు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. 
 
వ్యాధి సోకిన తర్వాత ఇలా చేస్తే మంచిది: 
⦿ శరీరం డీహైడ్రేషన్(నిర్జలీకరణ)కు గురికాకుండా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి. 
⦿ పాలు తాగడం కూడా మంచిదే. 
⦿ నోటిలో పుండ్ల వల్ల తినడం అసౌకర్యంగా ఉంటే.. ఆహారాన్ని మెత్తగా సూప్‌గా చేసుకుని తినండి. 
⦿ ముఖ్యంగా పెరుగు అన్నం తినడమే ఉత్తమం. 
⦿ కారం, మసాలాలు, వేడి వేడి ఆహారానికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. 
⦿ పారాసెటమాల్, ఇబుప్రోఫెన్ వంటి మాత్రలు గొంతు నొప్పి, జ్వరాన్ని తగ్గించగలవు.
⦿ గోరువెచ్చని, ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల నోటి పూతల నుంచి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.
⦿ నోటి పూతల మంట నుంచి ఉపశమనం కోసం మౌత్ జెల్, రిన్సెస్, స్ప్రేలను ఉపయోగించవచ్చు. 
⦿ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు ఏమీ తాగకపోతే ఫిట్స్‌, బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది.
⦿ ఈ వ్యాధి గురించి కలత వద్దు. 7 నుంచి 10 రోజులలో దానంతట అదే తగ్గిపోతుంది.
⦿ కానీ, ఈ వ్యాధిని భరించమే కష్టం.
⦿ మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును క్లాత్‌తో అడ్డుపెట్టుకోవాలి.
⦿ చేతులను తరచుగా సబ్బు, నీటితో కడగాలి.
⦿ రోగి ఉపయోగించే వస్తువులను, బెడ్‌ను ఉపయోగించవద్దు. 

Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?

గమనిక: ఈ వ్యాధిపై మీకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ సమాచారాన్ని అందించాం. ఇది వైద్యానికి, చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా.. డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget