By: ABP Desam | Updated at : 09 Dec 2022 12:14 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Instagram
ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్ద భూతంలా చూసేవాళ్ళు. అది వచ్చిందంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప బతికే అవకాశాలు చాలా తక్కువ అనుకుంటారు. కానీ ఇప్పుడు వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతూ అనేక వ్యాధులని కూడా నయం చేసి మళ్ళీ రోగులకి పునరుజ్జీవం ఇస్తుంది. అలా ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ ని జయించిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో టాలీవుడ్ నటి హంసా నందిని కూడా చేరింది. ఆమె కూడా తన తల్లికి వచ్చినట్టుగానే వంశపారపర్య రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. కానీ దాదాపు ఏడాదిన్నర పాటు చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది.
హెల్త్ లైన్ ప్రకారం వంశపారపర్య క్యాన్సర్ అంటే కుటుంబంలోని తండ్రి లేదా తల్లికి వస్తే అది తమ పిల్లలకి సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే కొన్ని జన్యువుల్లో మార్పు వల్ల ఇది సంభవిస్తుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం రొమ్ము క్యాన్సర్లు 5-10 శాతం, అండాశయ క్యాన్సర్లలో 10-15 శాతం వంశపారపర్య క్యాన్సర్ గా వస్తాయి.
BRCA అంటే వంశపారపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్. వాటిలో BRCA1, BRCA2 ముఖ్యమైనవి. క్యాన్సర్ తో పోరాడేందుకు సహాయపడే ట్యూమర్ సప్రెసర్ జన్యువులు ఇవి. అవి సాధారణంగా పని చేసినప్పుడు రెండు జన్యువులు రొమ్ము, అండాశయాల్లో ఇతర రకాల కణాలు వేగంగా పెరగకుండా ఉంచడంలో సహాయపడతాయి. కొన్ని సార్లు ఇందులోని కణాల్లో మార్పులు రావడం వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చేస్తాయి.
మయో క్లినిక్ ప్రకారం రొమ్ములోని కొన్ని కణాలు అసాధారణంగా మారినప్పుడు కణితి ఏర్పడుతుంది. అదే రొమ్ము క్యాన్సర్ గా వ్యాపిస్తుంది. మహిళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, కానీ ఇప్పుడు పురుషుల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ సాధారణంగా పాల నాళాల్లోని కణంలో ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ తొలిదశలో ఎటువంటి లక్షణాలు చూపించుకపోవడం వల్ల గుర్తించడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..
⦿ రొమ్ములో గడ్డలుగా అనిపించడం
⦿ రొమ్ము పరిమాణంలో మార్పులు
⦿ చనుమొల నుంచి ద్రవం రావడం
⦿ చర్మం చికాకుగా అనిపించడం
⦿ రొమ్ము ఎర్రగా మారిపోతుంది
⦿ జీవనశైలి, పర్యావరణ కారకాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతాయి.
⦿ వారసత్వంగా కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న నటి హంసా నందిని. తను ఈ క్యాన్సర్ బారిన పడినట్లు ఏడాది క్రితం ప్రకటించింది. తనకి వంశపారపర్య రొమ్ము క్యాన్సర్ లేదా BRCA1 పాజిటివ్ అని తేలిందని చికిత్స తీసుకుంటునట్లు ప్రకటించింది. తొమ్మిది సైకిల్స్ కీమో థెరపీ చేయించుకునట్లు ఇంకా మరో ఏడు మిగిలి ఉన్నాయని తెలిపారు. తర్వాత ఆమెకి వైద్యులు సర్జరీ చేసి రొమ్ములోని కణితి తొలగించారు. 18 ఏళ్ల క్రితం తన తల్లి కూడా ఇదే క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇప్పుడు తను క్యాన్సర్ ని జయించినట్లు ప్రకటిస్తూ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటునట్టు చెప్తూ ఫోటోస్ షేర్ చేసింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..
Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!