By: ABP Desam | Updated at : 08 Dec 2022 04:36 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
అన్నం తినేటప్పుడు పొలమారితే అల్లాడిపోతారు. దగ్గలేక చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ కూడా ఒక మహిళకి అలాగే జరిగింది. చైనాకి చెందిన ఒక మహిళ స్పైసీ ఫుడ్ తింటుంటే దగ్గు వచ్చింది. అది అలాంటి ఇలాంటి దగ్గు కాదండోయ్.. ఆమె దగ్గడం వల్ల ఏకంగా తన పక్క టెముకలు నాలుగూ విరిగిపోయాయి. వినడానికి విచిత్రంగా ఉంది కదా. అసలేం జరిగిందంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం హువాంగ్ అనే మహిళ స్పైసీ ఫుడ్ తింటుండగా అకస్మాత్తుగా దగ్గు వచ్చింది. భయంకరంగా వచ్చిన ఆ దగ్గుతున్నప్పుడు ఛాతీ నుంచి పగుళ్లు శబ్ధం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడంతో హాస్పిటల్ కి వెళ్ళగా పక్కటెముకలు విరిగినట్లు చెప్పారు. అయితే అది దగ్గు వల్ల అయిన గాయం కాదని ఎముకలు విరిగిపోవడానికి శరీర బరువు తగ్గడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకున్న తర్వాత హువాంగ్ కోలుకుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ పెంచుకునేందుకు ట్రై చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
వయస్సుకి తగిన రీతిగా బరువు ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు సరిగా లేకపోతే ముఖ్యమైన అవయవాలు పని చెయ్యవు. ఎముకలు ధృడంగా ఉండేందుకు, చర్మం, జుట్టు పెరుగుదల సక్రమంగా ఉండాలంటే శరీరానికి తగినంత పోషణ అవసరం. అది సరిగా లేకపోతే బరువు తక్కువగా ఉన్నట్టే. ఒక వ్యక్తి బరువు తగ్గడానికి జన్యుపరమైన నేపథ్యం లేదా బరువు పెరగకుండా నిరోధించే వైద్యపరమైన అనారోగ్యం వంటివి కారణాలు కావొచ్చు. అందుకే హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే బరువు చూస్తారు.
ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నారా లేదా అధిక బరువుతో ఉన్నారా అని తెలిపేది బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ). దీని ద్వారానే లెక్కిస్తారు.
⦿ తక్కువ బరువు/ 18.5 కంటే తక్కువ
⦿ సాధారణ/ ఆరోగ్యకరమైన బరువు: 18.5 నుంచి 24.9
⦿ అధిక బరువు: 25 నుంచి 29.9
⦿ ఊబకాయం: 30 లేదా అంతకంటే ఎక్కువ
⦿ జన్యుపరమైన కారణాలు లేదా వంశపారపర్యం
⦿ అధిక జీవక్రియ
⦿ తరచుగా శారీరక శ్రమ
⦿ దీర్ఘకాలిక వ్యాధులు
⦿ మానసిక అనారోగ్యం
బోలు ఎముకల వ్యాధి: తక్కువ బరువుగా ఉండటం వల్ల వాళ్ళు బోలు ఎముకల వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎముకలు పెళుసుగా మారిపోతాయి. చిన్న దెబ్బ తగిలినా కూడా సులభంగా విరిగిపోతాయి. తక్కువ బరువు ఉన్న మహిళలకి ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
చర్మ సమస్యలు: తక్కువ బరువు ఉంటున్నారంటే పోషకాహారం సరిగా తీసుకోవడం లేదని అర్థం. దాని వల్ల చర్మం మీద మచ్చలు, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం, దంత సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోగనిరోధక శక్తి తక్కువ: పోషకాహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వెంటనే వెంటనే అనారోగ్యానికి గురవుతారు.
రక్తహీనత: బరువు తక్కువగా ఉన్న వాళ్ళు రక్తహీనత బారిన పడతారు. దాని వల్ల తల తిరగడం, అలసట, తలనొప్పి తరచూ వచ్చి ఇబ్బంది పెడతాయి. స్త్రీలలో అయితే క్రమరహితంగా పీరియడ్స్ వస్తాయి. వచ్చిన సమయంలో కూడా బాధకారంగా ఉంటుంది.
ఎముకలు పెరగడానికి, బలంగా మారేందుకు సరైన పోషకాలు నిండిన పదార్థాలు తీసుకోవాలి. తక్కువ బరువు ఉన్నారంటే తగినంత కేలరీలు పొందలేరు. దాని వల్ల శరీర అభివృద్ధి ఉండదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
BRS Vs BJP: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఖర్మరా బాబూ అంటున్న మంత్రి కేటీఆర్
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!