Best food for couple: సుఖ జీవితం కోసం పరితపిస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే సంతానం, సంతోషం!
Best food: సుఖవంతమైన దాంపత్య కలయిక కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సంతానం, పడక సుఖం కావాలంటే ఏ డైట్ పాటించాలి?
ఆలుమగల మధ్య సంబంధం చిరకాలం ఉండాలంటే.. ‘సుఖ’జీవితం కూడా ఎంతో ముఖ్యం. కలయికలో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగితేనే సంతానం, సంతోషం లభించేది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆహార నిపుణులు కొన్నిరకాల ఆహారాలను సూచించారు. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ దాంపత్యం ఎంతో అనోన్యంగా, రొమాంటిక్‌గా సాగిపోతుంది.
దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కొందరిలో కుటుంబ సమస్యల వల్ల వచ్చే ఒత్తిడి కారణమైతే.. మరికొందరిలో పిల్లలు, కట్టుబాట్లు, అలసట, హార్మోన్ల ఇన్ బాలెన్స్ కూడా ముఖ్య కారణంగా చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఇటువంటి సందర్భంలోనే మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే చాలు ఆ ఆహారమే మీ బాడీలో సమతుల్యతను పెంచి మీ దాంపత్య జీవితాన్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందంటున్నారు నిపుణులు.
బ్రేక్‌పాస్ట్ లో ఏమేం తినాలి?..
ఉదయం బ్రేక్‌పాస్ట్ లో బెర్రీలు, పెరుగు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఆహార నిపుణులంటున్నారు. బెర్రీస్‌లో రక్త ప్రవాహానికి తోడ్పడే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయని, కలయిక సమయంలో పురుషుల పనితీరుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
బాదం పప్పు తీసుకోవడం కూడా చాలా మంచిదంటున్నారు. బాదంలో బి-విటమిన్లు అధికంగా ఉన్నాయని, ఇది హార్మోన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుందని.. అదే సమయంలో, సాదా పెరుగులో జింక్, విటమిన్ B12, మెగ్నీషియం కూడా ఉన్నాయి, ఇవి స్త్రీల ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి కీలకమైనవి సూచిస్తున్నారు.
అవకాడో కూడా ఆహారంలో చేర్చుకోవడం బెటర్ అంటున్నారు. ఇందులో విటమిన్ E ఉండటం వల్ల ఇది వాసోడైలేషన్‌కు సహాయపడుతుందని తత్ఫలితంగా ఇది కలయిక సమయంలో ఎంతో ఉపకరిస్తుందంటున్నారు.
ఇక ఎగ్స్ కూడా బ్రేక్‌పాస్ట్ లో చేర్చుకోవడం ఉత్తమం అంటున్నారు. గుడ్లలో అమైనో ఆమ్లం ఎల్-అర్జినైన్ ఉంటుందని ఇది కూడా పురుషులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
లంచ్‌లో తినాల్సిన ఆహారాలు:
ఇక లంచ్‌లో ఖచ్చితంగా బీట్‌రూట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయట ఇవి మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్‌గా ఉపయోగపడతాయంటున్నారు. అలాగే కలయికకు అవసరమైన శక్తిని అందించడంలోనూ బీట్‌రూట్, టోస్ట్ చాలా ఉపయోగపడతాయట.
పైన్ గింజలు కూడా లంచ్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుందని ఇది మగవారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాబట్టి వీటిని కూడా మధ్యాహ్నం తీసుకోవడం మంచిదంటున్నారు.
డిన్నర్‌లో ఏం తినాలి?
ఇక డిన్నర్‌లోనూ కలయికు ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేసే DHEA ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. క్వినోవా, స్వీట్ పొటాటోల్లో ఈ DHEA అధికంగా ఉంటుందని ముఖ్యంగా చిలకడ దుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుందట. కాబట్టి డిన్నర్‌లో వీటిని మిస్ అవ్వొద్దు.
ఇవే కాకుండా ప్రూట్స్ ముఖ్యంగా ఆపిల్స్, జీడిపప్పు, వెన్న, అరటిపండ్లు కూడా రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను మాత్రం దూరం పెట్టాలని వాటివల్ల జరిగే మంచి కన్నా చెడే ఎక్కువని సూచిస్తున్నారు.
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం కూడా ప్రమాదమేనని.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడానికి ఆల్కహాల్ దోహదపడుతుందని హెచ్చరిస్తున్నారు. మద్యం వినియోగాన్ని వారానికి 14 యూనిట్లకు మించకుండా పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలు తీసుకోకూడదని.. సాధ్యమైనంత వరకు తినే సమయంలో పరధ్యానాన్ని వదిలేసి తిండి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు ఆహార నిపుణులు.
Also Read : టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూ రెసీపీ.. ఇలా తయారు చేస్తే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.