By: ABP Desam | Updated at : 08 Feb 2022 02:25 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సంతృప్తి పరిచే ఆహారాలు ఎన్నో. కొన్ని వాసనతోనే మనలో తినాలన్న ఆశను రెట్టింపు చేస్తాయి. బిర్యానీ వంటివి దూరం నుంచే మసాలా దట్టింపు వాసన వేస్తూ తినాలన్న కోరికను పెంచేస్తాయి. అయితే కొన్ని ఆహారాలు కొందరిలో భయాన్ని (ఫోబియా) రెట్టింపు చేస్తాయి. రకరకాల ఫోబియాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఫుడ్ ఫోబియాలు కూడా ఉన్నాయి. మీకు ఈ ఫోబియాలు ఉన్నాయేమో చూసుకోండి.
చాక్లెట్లు
చాక్లెట్లు అంటే పడి చచ్చే వాళ్లే ఉంటారనుకుంటే, భయంతో చచ్చేవాళ్లు కూడా ఉంటారట. ఈ ఫోబియాను క్సోకోలాటోఫోబియా (Xocolatophobia)అని అంటారు. ఈ భయం ఉన్న వాళ్లు చాక్లెట్లు తినరు. చూస్తే చాలు ముఖం చిట్లించుకుంటారు.
పీనట్ బటర్
బ్రెడ్, పీనట్ బటర్‌తో బతికేసే వాళ్లు ఎంతో మంది. కానీ కొంతమందిలో మాత్రం అది భయాందోళనలు కలిగిస్తుంది. దీని వాసన, రూపం, రంగు ఏదీ ఇష్టపడరు ఈ ఫోబియా ఉన్న వాళ్లు. ఆ ఫోబియాను అరకిబ్యూటిరోఫోబియా (Arachibutyrophobia)అంటారు.
ఉల్లి, వెల్లుల్లిపాయలు
వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి అల్లియమ్ కుటుంబానికి చెందిన ఆహారాల వాసన, రూపం నచ్చకపోవడం కొందరిలో కలుగుతుంది. అవి వేసిన వంటలు కూడా తినరు. ఈ ఫోబియాను అలియంఫోబియా (Alliumphobia) అంటారు.
వంట భయం
వండి పెడితే ఎంతైనా తింటారు కానీ, వంట అంటే మాత్రం చాలా భయపడిపోతారు కొంతమంది. వారికి ఉన్న ఈ ఫోబియాను మెజిరోకోఫోబియా (Mageirocophobia)అంటారు. వీరిలో ఈ భయం రావడానికి పదునైన వస్తువులు వాడాలన్న ఆందోళన, మంట వల్ల ప్రమాదం జరుగుతుందోమో అన్న అభిప్రాయాలే కారణమని చెబుతున్నారు వైద్యులు.
కూరగాయలు
కూరలు తినమంటే పిల్లలు సరిగా తినరు. కాస్త పెద్దయ్యాక అన్ని తినడం మొదలుపెడతారు. కానీ కొందరికి మాత్రం పెద్దయ్యాక కూడా కూరగాయలతో చేసిన వంటలు తినడం ఇష్టపడరు. వాటిని తినడానికి ఆందోళన పడతారు. ఈ భయాన్ని లాచనోఫోబియా (Lachanophobia)అంటారు. ఈ ఫోబియా ఉన్న వాళ్లలో పోషకాహారలోపం తలెత్తే అవకాశం ఎక్కువ.
పండ్ల భయం
పండ్లను చూసి తినేందుకు భయపడే మనుషులూ ప్రపంచంలో ఉన్నారు. వీరి భయాన్ని ఫ్రక్టోఫోబియా ( Fructophobia) అంటారు. పండ్లు, పండ్ల రసాలు, పండ్ల ఆధారిత క్యాండీలు వీరు తినరు.
పుల్లని రుచి
పుల్లగా ఉండే పండ్లు, ఆహారాలు అంటే కొంతమంది భయపడతారు. వారు సిట్రస్ పండ్లను కూడా తినరు. వీరిలో విటమిన్ సి లోపం తలెత్తే అవకాశం ఎక్కువ. ఈ ఫోబియాను ఎసిరోఫోబియా (Acerophobia) అంటారు.
Also read: టీ, కాఫీలు మరీ వేడిగా తాగుతున్నారా? ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువంటున్న అధ్యయనం
Also read: కారంపొడికి బదులు పచ్చిమిర్చే వాడండి... డయాబెటిక్ రోగులకు మంచిది
విచిత్రం - హైవేపై స్పృహ తప్పిన డ్రైవర్, అదుపు తప్పకుండా 25 కిమీలు ప్రయాణించిన కారు
Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే
Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్
Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి
Snake Robotic Legs: పాము కాళ్లతో నడవడం చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు