Green Mirchi: కారంపొడికి బదులు పచ్చిమిర్చే వాడండి... డయాబెటిక్ రోగులకు మంచిది
చాలా మంది కారం పొడి అధికంగా వాడుతుంటారు. కానీ అధ్యయనాలు మాత్రం పచ్చిమిరపకాయలే ఉత్తమమని చెబుతున్నాయి.
కూర ఎర్రగా కనిపించాలంటే కారంపొడి వాడాల్సిందే. అందుకే చాలా మంది పచ్చిమిరపకాయల్ని పక్కన పెట్టి కారం పొడి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం శరీరానికి పచ్చిమిరపకాయలే చాలా మేలు చేస్తాయి. కారం పొడి వల్ల కలిగే లాభం చాలా తక్కువ. కానీ పచ్చిమిరపకాయలు మాత్రం డయాబెటిక్ రోగులకు మంచి చేయడంతో పాటూ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలోనూ, చర్మ కాంతిని పెంచేందుకు కూడా సహకరిస్తాయి.
1. ఆధునిక కాలంలో రకరకాల క్యాన్సర్లు దాడి చేస్తున్నాయి. పచ్చిమిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ కూరల్లో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోకి చేరిన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు అందిస్తాయి.
2. కారంపొడికి పచ్చి మిర్చిని వాడడం వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. కారంపొడి వేసిన కూరలు తినడం బీపీ తగ్గుతుందనే నమ్మకం లేదు. వీటిని తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా దరిచేరదు. వీటిలో విటమిన్ బి6, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. రక్త ప్రసరణ చక్కగా అయ్యేందుకు ఇవి అవసరం.
3. కంటి చూపుకు కూడా ఇవి అవసరం. కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. దృష్టి సమస్యలు రావు.
4. చర్మ సౌందర్యానికి కూడా ఇవి చాలా అవసరం. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. యాంటీ ఏజింగ్ గా పచ్చిమిరపకాయలు పనిచేస్తాయి.
5. గుండెకు కూడా పచ్చిమిరపకాయలు చాలా మేలు చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఇవి తగ్గిస్తాయి. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, గుండె పోట కూడా వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఈ లాభాలు పొందడం కోసం రోజుకు ఒక పచ్చిమిరపకాయ తిన్నా చాలు.
6. బరువు తగ్గేందుకు కూడా పచ్చిమిరపకాయలు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు కారంపొడి వాడకాన్ని పూర్తిగా మానివేసి దాని స్థానంలో పచ్చిమిరపకాయలను వాడడం ప్రారంభించండి. కొవ్వును కరిగించడంలో ఇది ముందుంటుంది. క్యాలరీలు వేగంగా ఖర్చువుతాయి.
7. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా అవసరం. ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వడానికి ఇవి సాయపడతాయి. అజీర్తి సమస్యలు ఉన్న వారికి పచ్చిమిరపకాయలు వేసిన ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
8. డయాబెటిస్ రోగులు రోజూ పచ్చిమిరపకాయలు తినడం మంచిది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా మధుమేహ రోగం కూడా అదుపులో ఉంటుంది.
9. ఆకలి పెంచడానికి పచ్చిమిరపకాయలు దోహదపడతాయి.
10. గాయాలు అయినప్పుడు రక్తస్రావం అధికంగా కాకుండా చూసుకునే గుణం ఇందులో ఉంది.
11. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అందుకే కారం పొడి వాడకాన్ని తగ్గించి పచ్చిమిరపకాయల్ని వాడడం మొదలుపెట్టాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ప్రయాణంలో వాంతులు, వికారం వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
Also read: దానిమ్మ గింజల్లోనే కాదు దాని తొక్కలో కూడా ఎన్నో సుగుణాలు, పొడి చేసి ఇలా వాడుకోండి