కళ్లు తిరుగుతున్నాయా? జాగ్రత్త, మీకు ఈ అనారోగ్యాలు ఉండొచ్చు
కళ్లు తిరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కళ్లు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు.
కళ్లు తిరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. బయటి వాతావరణ స్థితుల నుంచి ఏవైనా మందులు వాడటం లేదా మరేదైనా శారీరక అనారోగ్యం వంటి కారణాలలో ఏదైనా కావచ్చు. తరచుగా కళ్లు తిరుగడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అయితే చాలా సార్లు పెద్దగా చికిత్స అవసరం లేకుండానే చక్కబడే సమస్య. కానీ అప్పుడప్పుడు ఇలా కళ్లు తిరగడం ఏదైనా అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. కళ్లు తిరిగే పద్ధతి కూడా రకరకాలుగా ఉంటుంది. అది ఎలాగో చూడండి.
- అకస్మాత్తుగా వెనక్కి తిరిగినపుడు కళ్లు తిరిగినట్టు అనిపించడం
- వేగంగా నిలబడడం లేదా కూర్చోవడం వల్ల
- చాలా ఇంటెన్స్డ్ వర్కవుట్ వల్ల
విర్టిగో: చాలా మంది కళ్లు తిరగడం విర్టిగో ఒకటే అనుకుంటారు. ఒకేలాగ అనిపించినా ఇవి రెండు కొన్ని తేడాలు ఉంటాయి. కొంత మందిలో కళ్లు తిరుగుతున్నపుడు గందరగోళానికి లోనవుతారు. వెర్టిగోలో మనం ప్రమేయం లేకుండా కదిలిపోతున్న భావన కలిగిస్తుంది. విర్టిగోలో చుట్టు ఉన్న పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. విర్టిగో లోపలి చెవిలో సమస్యల వల్ల వస్తుంది. లోపలి చెవిలో కాల్షియం కార్బేనేట్ పార్టికల్స్ చేరినపుడు ఈ రకమై సమస్య వస్తుంది. దీనిని బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ విర్టిగో అంటారు. చెవిలో చేరిన కాల్షియం కార్బోనేట్ పార్టికల్స్ మెదడు సమాచారం సేకరించడంలో ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల కళ్లు తిరుగుతాయ.
మైగ్రేన్: మైగ్రేన్ వల్ల కూడా కొందరిలో తల నొప్పితో పాటు కళ్లు తిరగడం, వికారం, వాంతులు కావడం వంటి సమస్యలు ఉంటాయి. మరి కొంత మందిలో మైగ్రేన్ రావడానికి ముందే ఒక సూచనగా కళ్లు తిరుగుతాయి.
లో బీపి: ఒక్కసారిగా బీపీ స్థాయిలు పడిపోవడం వల్ల కూడా కళ్లు తిరుగుతాయి. ఇలాంటి మార్పులు అకస్మాత్తుగా నిలబడడం, లేదా కూర్చోవడం, లేదా వెనక్కి పైకి తల తిప్పడం చేస్తే జరగవచ్చు. కొంత మందిలో డీహైడ్రేషన్, గాయపడి రక్తం పోవడం, ఎలర్జిక్ రియాక్షన్ల వల్ల, ప్రెగ్నెన్సీ వల్ల కూడా బీపీ పడిపోయి కళ్లు తిరగవచ్చు.
కార్డియో వాస్కులార్ డిసీజ్: రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల హార్ట్ ఫేయిల్యూర్ కు కారణం కావచ్చు. దీనికి ముందు కళ్లు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు. హార్ట్ ఎటాక్ కు ముందు కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్బాలలో గుండె లయ తప్పడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో అసౌకర్యం, ఆగకుండా దగ్గు రావడం, నీరసం, కాళ్లు, చేతుల్లో నీరు చేరడం, వికారం, వాంతులు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి.
రక్త హీనత: ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందువల్ల బ్రెయిన్ కు సరిపడినంత ఆక్సిజన్ అందక పోవడం వల్ల కళ్లు తిరుగుతాయి. కళ్లు తిరగడం మాత్రమేకాదు, ఆయాసంగా ఉండడం, ఛాతిలో నొప్పి, నీరసం కూడా అనిపిస్తుంది.
హైపోగ్లైసిమియా (లో బ్లడ్ షుగర్): రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే తక్కువ నమోదు అయినపుడు కళ్లు తిరగవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల వల్ల, హర్మోనల్ సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఒత్తిడి: ఒత్తిడి దీర్ఘకాలంగా కొనసాగుతున్నపుడు కూడా కళ్లు తిరిగే సమస్య వస్తుంది. ఇందుకు డిప్రెషన్, యాంగ్జైటీ, గుండె సమస్యలు, డయాబెటిస్ లేదా ఇతర రోగ నిరోధక కారణాలు కారణం కావచ్చు. ఇలాంటపుడు చెమటలు పట్టడం, శరీరంలో వణుకు, తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె దడ, నిద్ర సరిగ ఉండక పోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?: కళ్లు తిరగడం సాధారణ అనారోగ్యమే. చాలా సార్లు దానంతంట అదే తగ్గిపోతుంది కూడా. కానీ ఒక వస్తువు రెండుగా కనిపిస్తున్నపుడు, వాంతులు, జ్వరం, తిమ్మిర్లు, కదలడానికి ఇబ్బంది లేదా శరీరం స్వాధీనం తప్పిన, తలనొప్పి, ఛాతిలోనొప్పి, స్పృహతప్పితే తప్పనిసరిగా డాక్టర్ ను కలిసి సరైన చికిత్స తీసుకోవడం అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.