Weight Loss Myths: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ అపోహలు నమ్మకండి
ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య కరోనా. తరువాతి స్థానం మాత్రం ఊబకాయానిదే. బరువు తగ్గాలనుకుంటున్నవారు కొన్ని అపోహలు నమ్మకూడదు.
బరువు పెరిగే సమస్య అమెరికా, చైనాలలో అధికంగా ఉంది. ఆ తరువాతి స్థానం మనదేశానిదే. భవిష్యత్తులో మనం ఆ రెండు దేశాలను దాటి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆధునిక జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేమి... ఇలా చాలా కారణాల వల్ల ప్రజలు బరువు పెరుగుతున్నారు. పెరుగుతున్న బరువును నియంత్రించుకునేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో అనేక అపోహలను కూడా నిజాలుగా నమ్ముతున్నారు. అలాంటి కొన్ని అపోహలు ఇవన్నీ.
1. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినడం వల్ల ఇంకా బరువు పెరుగుతారనే నమ్మకం ఉంది ప్రజల్లో. అందువల్ల ఆ ఆహారాన్ని పూర్తిగా మానేసే వాళ్లు ఉన్నారు. నిజానికి మన శరీరం చేసే ప్రతి కదలికకు కార్బోహైడ్రేట్లు అవసరం. కనుక వాటిని పూర్తిగా మానివేయకూడదు. తగిన మొత్తంలో వాటిని కూడా తీసుకోవాలి. లేకుంటే ఇతర సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.
2. ఫ్యాట్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, లో ఫ్యాట్ ఇలాంటి లేబుల్స్ అనేక ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్లో దొరుకుతుంది. వాటిని తినడం వల్ల బరువు పెరగమని చాలామంది అనుకుంటారు. వాటి వల్ల ఇంకా బరువుపెరుగుతారే కానీ తగ్గే అవకాశాలు తక్కువ. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు పూర్తిగా ఇంటి ఆహారానికే పరిమితమవ్వాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ జోలికి పోకూడదు.
Also read: తీపి అధికంగా తింటే షుగర్ జబ్బు వస్తుందా? పిల్లలకు కూడా రావడానికి ఇదే కారణమా?
3. హెర్బల్ టీలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాటిని తాగడం వల్ల శారీరం డిటాక్స్ అవుతుంది. ఆ టీలు బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. నిజానికి అలాంటిదేమీ నిర్ధారణ కాలేదు. అవి బరువు తగ్గడానికి సహాయపడవు.
4. ఆహారం తినకుండా కడుపు మాడ్చుకుంటే బరువు సులువుగా తగ్గుతారని అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల కొత్త సమస్యలు కలుగుతాయి. బరువు తగ్గే అవకాశం మాత్రం తక్కువ. కొంతమంది క్రాష్ డైట్లు ఫాలో అవుతారు. వాటి వల్ల ముఖ్యమైన పోషకాలేవీ శరీరానికి అందవు. దీని వల్ల శక్తి తగ్గిపోతుంది. అంతేకాదు తీపి పదార్థాలు తినాలన్న కోరికను కూడా పెంచుతుంది.
Also read: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..