Sleeping Tips : నిద్ర రావట్లేదా? రాత్రి పడుకునే ముందు సాక్స్‌లు వేసుకుని పడుకోండి, గాఢ నిద్ర మీ సొంతం
Socks Can Improve Sleep Quality : రాత్రి నిద్ర సమయంలో సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారికి కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Sleeping With Socks : మనలో చాలామందికి నిద్రలేమి సమస్య ఉంది. త్వరగా పడుకున్నా.. నిద్ర రాక మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ రాత్రంతా గడిచిపోతుంది కొందరికి. ఈ పరిస్థితిని దూరం చేసుకోవడానికి.. చాలామంది తమ ఫోన్లను పక్కన పెట్టేస్తారు. మూలికా టీ తాగడం వంటి ఇంటి చిట్కాలు కూడా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ప్రశాంతంగా నిద్రపోలేనివారు చాలామందే ఉంటారు. కానీ ఒక పరిశోధన ప్రకారం.. నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల నిద్ర నాణ్యత బాగా మెరుగుపడుతుందని గుర్తించారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ దీనిపై పరిశోధన చేసింది. నిద్రపోయే ముందు పాదాలను కొద్దిగా వెచ్చగా ఉంచడం వల్ల మెరుగైన నిద్రకు చాలా సహాయపడుతుందని గుర్తించారు. కాబట్టి మంచి నిద్ర కోసం నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించాలంటున్నారు. దీనివెనుక సైంటిఫిక్ రీజన్స్ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
సాక్స్, బ్రెయిన్ కనెక్షన్ ఇదే
నిద్రపోయే సమయంలో శరీరం తనను తాను శాంతపరచడం, చల్లబరచడం ప్రారంభిస్తుంది. దీనిని వైద్య భాషలో థర్మోరెగ్యులేషన్ అంటారు. మీ చేతులు, కాళ్ళు వెచ్చగా ఉన్నప్పుడు.. శరీర రక్త నాళాలు విస్తరిస్తాయి. దీనిని వాసోడైలేషన్ అంటారు. ఇది శరీరంలోని అంతర్గత వేడిని నెమ్మదిగా చర్మం ద్వారా విడుదల చేస్తుంది. దీనివల్ల శరీరం చల్లబరచడం ప్రారంభమవుతుంది. ఇది నిద్రలోకి వెళ్లడానికి అవసరమైన సంకేతాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు సాక్స్ వేసుకోవడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది. సాక్స్ పాదాలను వెచ్చగా ఉంచుతాయి. ఇది విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని మెదడుకు సంకేతం పంపుతుంది.
హార్వర్డ్ పరిశోధనలో నిద్రపోయే ముందు చర్మాన్ని కొద్దిగా వేడి చేస్తే.. నిద్రపోవడానికి పట్టే సమయం తగ్గుతుందని, నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఇది పూర్తిగా సహజమైనది. సురక్షితమైనది. చవకగా ప్రయత్నించగలిగే బెస్ట్ టిప్.
సాక్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
- త్వరగా నిద్రపోవడం - నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల శరీరం నిద్రను ప్రోత్సహించే సంకేతాలను మెదడుకు పంపుతుంది.
- గాఢ నిద్ర - నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరిస్తే శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది గాఢ నిద్రకు దారి తీస్తుంది.
- నిద్ర నాణ్యతను మెరుగుపరచడం - నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల తరచుగా నిద్రకు భంగం కలిగే అవకాశాలు తగ్గుతాయి.
- ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు - నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించడం వల్ల నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది. ఈ పద్ధతి పూర్తిగా సురక్షితం.
సాక్స్ వేసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలంటే..
- సరైన సాక్స్ ఎంచుకోండి - మరీ వదులుగా లేదా చాలా టైట్‌గా లేని సాక్స్‌లను వేసుకోండి. ఇది రక్త ప్రసరణను కొనసాగిస్తుంది. సాఫ్ట్ కాటన్, వెదురు లేదా తేలికపాటి ఉన్ని సాక్స్ ఉత్తమమైనవి.
- నిద్రపోయే ముందు ధరించండి - సాక్స్ నిద్రపోయే 20–30 నిమిషాల ముందు వేసుకోండి. తద్వారా శరీరం వాటిని అనుభూతి చెంది ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది.
- గది ఉష్ణోగ్రత చల్లగా ఉండాలి - పాదాలను వెచ్చగా ఉంచాలనుకున్నప్పుడు, గదిని కొద్దిగా చల్లగా ఉంచుకోవాలి. ఇది మంచి నిద్రకు సరైనది.
చలికాలంలో సాక్స్‌లు వేసుకుని పడుకోవడం చాలామంచి ప్రయోజనాలు అందిస్తుంది. చలిని తగ్గించడంతో పాటు మెరుగైన నిద్రను అందిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















