By: ABP Desam | Updated at : 17 Mar 2023 09:27 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
చాలా మంది నిద్రపోయే ముందు ఐ మాస్క్ (స్లీప్ మాస్క్) ధరించి పడుకుంటారు. ఎటువంటి వెలుతురు కళ్ళలో పడకుండా నిద్రాభంగం కలగకుండా ఉండటం కోసం అలా చేస్తారు. కంటికి ముసుగు వేసుకుని పడుకోవడం మంచిది కాదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. కానీ సైన్స్ మాత్రం ఐ మాస్క్ ధరించడం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని అంటుంది. దీనికి సంబంధించిన ఒక అధ్యయనాన్ని నిపుణులు ఉటంకిస్తున్నారు. వెలుతురు ఉండటం వల్ల నిద్రని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తారు. అలా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం రాత్రి పూట నిద్రలో కంటికి మాస్క్ ధరించడం వల్ల కాంతిని నిరోధించడంతో పాటు జ్ఞాపకశక్తి, మెదడు చురుకుగా ఉంటుందని తేలింది. స్లీప్ మాస్క్ లు ఎలా సహాయపడతాయో తెలుసుకోవడం కోసం పరిశోధకులు రెండు ప్రయోగాలు చేశారు. ఇవి ధరిస్తే నిద్రకు ఆటంకం కలుగుతుందా లేక కంటికి మేలు చేస్తుందా అనేది పరిశీలించారు.
మొదటి ప్రయోగంలో 18-35 సంవత్సరాల వయస్సు కలిగిన 94 మందిని ప్రతి రోజు రాత్రి పుటా నిద్రపోయే ముందు స్లీప్ మాస్క్ ధరించమని చెప్పారు. మరొక వారం వాళ్ళ కంటికి ఎటువంటి మాస్క్ పెట్టకుండా ఉంచారు. వీరిలో మెదడు పనితీరు బాగుండటాన్ని గుర్తించారు. మాస్క్ ఉపయోగించినప్పుడు మెదడు చురుకుగా పనిచేసిందని పరిశోధకులు తెలిపారు. ఇక రెండో ప్రయోగంలో మాస్క్ పెట్టుకుని, పెట్టుకోకుండా నిద్రపోయారు. ఇందులో ఒకే వయస్సు ఉన్న 35 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారి నిద్ర విధానం ఎలా ఉందనేది తెలుసుకునేందుకు ఒక డివైజ్ అమర్చారు.
రెండో ప్రయోగంలో పాల్గొన్న వాళ్ళు నిద్రపోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. మాస్క్ ధరించి నిద్రలో గడిపిన సమయం ద్వారా జ్ఞాపకశక్తిని అంచనా వేశారు. నిద్రపోయేటప్పుడు కళ్ళకు ముసుగు ధరించడం వల్ల మెదడు పనితీరుకు ప్రయోజనం చేకూరిందని పరిశోధకులు తెలిపారు.
నిద్ర నాణ్యత పెరుగుతుంది. స్లీప్ మాస్క్ ఉండటం వల్ల త్వరగా నిద్ర పడుతుంది. కంటిలోకి ఎటువంటి కాంతి ప్రసరించకుండా ఇది అడ్డుకుంటుంది. దీని వల్ల శరీరం మెలటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది శరీరాన్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఎటువంటి ఆటంకం లేకుండా మెలుకువ లేకుండా సాఫీగా నిద్రపోవచ్చు. కాంతి ఎక్కువగా కళ్ళల్లో పడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి అధికంగా ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే కళ్ళకు మాస్క్ ఉంటే మంచిది. ఇది పెట్టుకోవడం వల్ల చీకటిగా ఉంది నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా కంటికి కూడా మాస్క్ లు పెట్టుకుంటారు. హాట్ కంప్రెస్ ఐ మాస్క్ లు సౌకర్యంగా అనిపించినప్పటికీ కళ్ళకి అది మంచిది కాదు. రాత్రిపూట కళ్ళు స్వేచ్చగా ఊపిరి పీల్చుకునేలా ఉండాలి. కానీ స్లీప్ మాస్క్ ధరించడం వల్ల ఆక్సిజన్ అందక కళ్ళు పొడిబారిపోవడం జరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గాయాల నుంచి రక్తం ఆగడం లేదా? ఆ విటమిన్ లోపం వల్లే ఈ సమస్య!
కేరళలోని ఈ ప్రత్యేక వేడుకలో పురుషులంతా మహిళల్లా తయారవుతారు
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
World Idly Day: ఆ ఇడ్లీ అమ్మే వ్యక్తి పుట్టినరోజు ‘ప్రపంచ ఇడ్లీ డే’గా ఎలా మారింది?
నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?
ఈ పండ్లు పేరేమిటో తెలుసా? కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు