News
News
X

మీ పిల్లలు ప్రయోజకులు కావాలా? అయితే, వారితో కలిసి టీవీ చూడండి, ఎందుకంటే..

ఎక్కువ సమయం పాటు స్క్రీన్ చూడడం వల్ల పిల్లల్లో చదివే ఆసక్తి తగ్గి తద్వారా భాష మీద పట్టు తగ్గుతుందని ఇప్పటి వరకు అనుకున్నారు. కొన్ని జాగ్రత్తలతో పిల్లలతో టీవి చూడడం మంచిదట అదేలాగో చూద్దాం

FOLLOW US: 

మధ్య పిల్లలు ఆటలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లోనే పిల్లల చానెళ్లు లేదా ఓటీటీ సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. కరోనా వైరస్ వల్ల ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. ఆన్‌లైన్ క్లాసుల కోసం తప్పని పరిస్థితుల్లో పెద్దలు వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. దీంతో అవి వారికి క్రమేనా అలవాటుగా మారాయి. క్లాసులు జరగకపోయినా.. ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటున్నారు. కరోనా టైమ్‌లో బయటకు ఆటలకు కూడా వదలకపోవడం వల్ల చాలామంది పిల్లలు టీవీ చానెళ్లు చూస్తూ కాలం గడిపేశారు. అది కూడా వారికి ఒక వ్యసనంలా మారిపోయింది. అయితే, మీ పిల్లలు ఏం చూస్తున్నారనేది తప్పకుండా కనిపెడుతూ ఉండాలి. వీలైతే వారి పక్కనే కూర్చొని.. కలిసి టీవీ చూడండి. టీవీలో వచ్చే కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించండి. వీలైనంత వరకు వారికి విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను చూపిస్తూ.. అందులో ఏమున్నాయో వివరించండి. వాటి గురించి చర్చించడం ద్వారా పిల్లల్లో నాలెడ్జ్‌ను పెంచవచ్చు. దీన్ని బట్టి బయటకు వెళ్లకుండానే బోలెడన్ని విషయాలను పిల్లలు తెలుసుకోవచ్చు. దీనివల్ల మీ పిల్లలు ప్రయోజకులు కూడా అవుతారు. ఔనండి, నిజం. దీనిపై ఇటీవల నిర్వహించిన పలు అధ్యయనాలు కూడా ఇదే నిరూపించాయి. పెద్దలు పిల్లలతో కలిసి టీవీ చూడటం వల్ల వారిలో చాలా మార్పులు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఇంకా ఏయే విషయాలు తెలిశాయో చూడండి. 

స్క్రీన్ టైం పెరిగే కొద్దీ పిల్లల్లో ఆడుకునే ఆసక్తి సన్నగిల్లడం, భాష నేర్చుకోవడంలో వెనుక బడడం వంటి సమస్యలు రావచ్చు. వారు చూసే కార్యక్రమాల వల్ల ఇటువంటి సమస్యలు రావచ్చని పెర్ట్స్మైత్ యూనివర్సిటి పరిశోధకులు అంటున్నారు.  అయితే పేరెంట్స్ తమ పిల్లలతో కలిసి టీవి చూడడం వల్ల వారి లెర్నింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చెయ్యడం మాత్రమే కాదు, వారి కన్వర్షేషన్ స్కిల్స్  కూడా మెరుగవుతాయని ఓ అధ్యయనం చెబుతోంది.

‘‘టీవీల్లోని కొన్ని కార్యక్రమాల్లోని సమాచారం, వాటికి అర్థాన్ని పిల్లలు గ్రహించలేరు. వాటిని జనరలైజ్ చేసుకోవడం వంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. అటువంటి సందర్భాల్లో వారి మెదడు సమాచారాన్ని స్వీకరించలేక పోవచ్చు’’ అని డాక్టర్ ఈస్టర్ సొమోగి అభిప్రాయపడ్డారు. అయితే పెద్దలు.. పిల్లలతో కలిసి టీవీ చూస్తూ దాని గురించి వివరించడం, తెలియని విషయాల గురించి మాట్లాడటం వంటివి చేస్తే విషయాన్ని త్వరగా అర్థం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా ఎడ్యూకేషనల్ ప్రోగ్రాములు చూసే సమయంలో పిల్లలకు ఇటువంటి తోడు అవసరం ఉంటుంది.

పిల్లల సంరక్షకులు కూడా కొత్త టెక్నాలజీని పిల్లలను ఎడ్యూకేట్ చేయడానికి వాడుకోవాలని ప్యారీస్‌కు చెందిన మరో రీసెర్చర్ డాక్టర్ బాహియా గుల్లై సలహా ఇస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు పిల్లల్లో సోషల్ ఇంటరాక్షన్ పెంచేందుకు దోహదం చేస్తాయి. కానీ పెద్దవారికి అవి ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని మరచిపోవద్దనేది ముఖ్యమైన సూచన కూడా ఆయన చేస్తున్నారు.  ప్రస్తుత జనరేషన్, ఇక రాబోయే జనరేషన్ కూడా ఎంత స్క్రీన్ టైం ఒక రోజులో మనం కేటాయించుకోవాలనేది కూడా జీవితంలో నేర్చుకోవాల్సిన మరొక స్కిల్.  పాండమిక్ సమయంలో లాక్ డౌన్ ల వల్ల పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరిగిపోవడం వల్ల వారి మానసిక స్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు ఈ అధ్యయనానికి ప్రాముఖ్యత పెరిగింది. ఈ అధ్యయనం గత ఇరవై సంవత్సరాలలో 478 స్టడీస్ ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్థారించారు.

Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు

Published at : 23 Sep 2022 06:39 PM (IST) Tags: Education TV Smart Phones studies Children Watching TV

సంబంధిత కథనాలు

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

పెరిగే వయసుకు కళ్లెం వెయ్యాలా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే!

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

International Music Day: సంగీతం వినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు ఇవే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే ఆ నష్టం తప్పదు

World Coffee Day 2022: రోజుకో కప్పు కాఫీతో మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుదల, అతిగా తాగితే  ఆ నష్టం తప్పదు

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

Ghee coffee: రకుల్‌ ప్రీత్‌కు నెయ్యి కాఫీ అంటే ఎంతో ఇష్టమట! మీరూ ట్రై చేస్తారా?

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?