మేకప్ మాయ.. క్షణాల్లో షారుక్ ఖాన్ రూపంలోకి మారిపోయిన యువతి.. వీడియో వైరల్
ఈమె తలచుంటే సమంతలానే కాదు.. షారుక్ ఖాన్‌లా కూడా మారిపోగలదు. నమ్మడం లేదా? అయితే, ఈ వీడియో చూడండి.
మేకప్ అందాన్ని ఇస్తుందని తెలుసు. కానీ, రూపురేఖలను కూడా మర్చేస్తుందా? మేకప్‌తో మన ముఖాన్ని నచ్చిన సెలబ్రిటీ ఫేస్‌లా మార్చేసుకోవచ్చా? ఈ ప్రశ్నకు.. ఆమె ఔననే సమాధానం ఇస్తోంది. అంతేకాదు.. తనని షారుక్ ఖాన్ రూపంలోకి మార్చేసుకుని ఆశ్చర్యపరిచింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ముందుగా మీరు ఆమె గురించి తెలుసుకోవాలి.
ఢిల్లీకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ దీక్షిత తలచుకుంటే.. ఏ సెలబ్రిటీ రూపంలోకైనా మారిపోగలదు. ఆడ, మగా తేడా లేకుండా.. ఏ సెలబ్రిటీ రూపంలోకైనా మారిపోగల టాలెంట్ ఆమెది. తాజాగా ఆమె తన మెకప్ స్కిల్స్‌తో షారుక్ ఖాన్‌లా మారిపోయింది. ఆమె పోస్ట్ చూసిన నెటిజనులు వారేవ్వా అంటూ ఆమెన పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమె కేవలం షారుఖ్ ఖాన్‌లాగానే కాదు.. ఇంకా ‘మనీ హీస్ట్’ ప్రొఫెసర్ రూపంలోకి కూడా మారిపోతుంది. దక్షిణాది హీరోయిన్లు సమంత, నయనతార, బాలీవుడ్ నటి కాజోల్ రూపంలోకి మారిపోయి ఆశ్చర్యపరుస్తోంది. నెటిజనులు ఆమె టాలెంట్‌ను చూసి ఫిదా అవుతున్నారు. మీకు కూడా ఆమె మేకప్ మాయను చూడాలని అనుకుంటున్నారా? అయితే.. ఈ వీడియో చూసేయండి.
Also Read: ప్రేమ ‘గాయం’.. యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...
షారుక్ ఖాన్:
View this post on Instagram
సమంత:
View this post on Instagram
‘మనీ హీస్ట్’ ప్రొఫెసర్:
View this post on Instagram
Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)
Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి