Vegan Eggs: వీగన్ల కోసం శాకాహార గుడ్లు, వీటిని ఎలా తయారుచేస్తారంటే
వీగన్ల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే వారి కోసం ప్రత్యేక ఆహారం మార్కెట్లోకి అడుగుపెడుతోంది.
ప్రొటీన్‌కు కేరాఫ్ అడ్రెస్ కోడి గుడ్లు. కానీ వీగనిజం వేగంగా ప్రపంచాన్ని ఆక్రమించేస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు వీగన్లుగా మారిపోయారు. సాధారణ ప్రజల్లో కూడా వీగనిజం బాట పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వారు కోడిగుడ్లను తినడం మానేయడం వల్ల జంతు ప్రొటీన్‌కు దూరం అవుతున్నారు. వారికి ప్రొటీన్ లోపం రాకుండా ఉండేందుకు శాకహార గుడ్లను తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటికి వీగన్ ఎగ్స్ గా పేరుపెట్టారు. వీటిని పూర్తి మొక్కల ఆధారిత పదార్థాలతోనే తయరుచేస్తారు. ఇవి ప్రొటీన్ ప్యాక్ట్ ఫుడ్.
ఎలా తయారుచేస్తారు?
శాకాహారి గుడ్లను పెసరపప్పు, సోయా, చిక్కుళ్లు,బఠానీలు, కొమ్ముశెనగలు వంటివాటిని ప్రాసస్ చేయడం ద్వారా తయారుచేస్తారు. గుడ్లలోని సొనలా కనిపించడం కోసం కాస్త పసుపు కలుపుతారు. ఇది పచ్చసొనను పోలినట్టు ఉంటుంది. ఈ గుడ్లతో కోడిగుడ్లతో చేసుకునే వంటలన్నీ చేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకోవచ్చు, బుర్జీ చేసుకోవచ్చు,మీకు నచ్చిన వంటకాన్ని వండుకోవచ్చు. కేవలం గుడ్లు ఆకారమే కాదు, రుచి కూడా అలాగే ఉంటుంది. అందుకే వీగన్లకు కోడిగుడ్ల రుచిని మిస్ అయిన ఫీలింగ్ రాదు.
కొలెస్ట్రాల్?
కోడిగుడ్లలో కొంత కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ వీగన్ల గుడ్లలో మాత్రం ఒక్కశాతం కూడా ఉండదు. అందుకే వీటిని ఎన్ని తిన్నా బరువు పెరుగుతామన్న టెన్షన్ ఉండదు. అందులో జంతు ఆధారిత ఆహారంతో పోలిస్తే మొక్కల ఆధారిత ఆహారం బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.కాబట్టి వీగన్లకు ఈ గుడ్లు బాగా నచ్చతాయి.
అయితే ప్రొటీన్ అసలైన కోడిగుడ్లలో కన్నీ వీటిలో ప్రొటీన్ తక్కువే ఉంటుంది.వీటి తయారీలో ప్రాసెస్ చేయడం అధికంగా ఉంటుంది కాబట్టి అదొక మైనస్ అనే చెప్పుకోవాలి. అధిక ప్రాసెస్ చేసిన ఆహారం గుండెకు మంచిది కాదని చెబుతారు. కాబట్టి ఈ గుడ్లను మితంగా తినడమే ఉత్తమం.
వీగనిజం అంటే...
జంతు ఆధారిత ఆహారాలేవీ తినకుండా కేవలం మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తినేవారు వీగన్లు. వీరు కనీసం తేనె, పాలు, పనీర్ వంటివి కూడా తినరు. అవి కూడా జంతు ఆధారిత ఆహారాలే కాబట్టి. లెదర్ బ్యాగులు కూడా వాడరు. ఆ లెదర్ జంతు చర్మాల నుంచి తయారు చేస్తారని. ఈ వీగనిజం ప్రపంచంలో బాగా పాకిపోతోంది.
Also read: మధుమేహులకు తెల్లన్నం ఎంత హాని చేస్తుందో చపాతీలు అంతే హాని చేస్తాయి, ICMR అధ్యయనం
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.