అన్వేషించండి

ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి

జీడి పండ్లను పల్లెటూళ్లలో తప్ప పట్టణాల్లో తినడమే మానేశారు.

జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది? జీడి పండుకు చివర తొడిగే మొగ్గనే జీడిపప్పు. జీడిపప్పును ఎన్నో పోషకాల ఆహార జాబితాలో కలిపేశారు. కానీ జీడిపండును మాత్రం ఎవరూ పట్టించుకోరు. నిజం చెప్పాలంటే జీడిపప్పు కన్నా జీడి పండులోనే పోషకాలు అధికం. దీన్ని ఆంగ్లంలో ‘క్యాషూ ఆపిల్’ అంటారు. పసుపు, ఎరుపు, నారింజరంగుల్లో మెరిసిపోతుంది ఈ పండు. వీటితో ఆల్కహాల్ కూడా తయారుచేస్తారు. ఈ పండ్లలో రాగి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్ వంటి ప్రొటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. 

1. ఈ రుచికరమైన పండులో అత్యవసరమైన ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్ లేదా హానికరమైన బ్యాక్టిరియాలు,వైరస్‌లతో పోరాడతాయి. ఇందులో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే జీడిపండ్లను అప్పుడప్పుడు తినాలి. 
2. క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవడంలో జీడి పండులోని సమ్మేళనాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రోయాంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండ్లు అందుబాటులో దొరికితే కచ్చితంగా తినండి. వీటిలో రాగి కూడా అధికంగా ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్‌ను రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి. 
3. ఆధునిక కాలంలో గుండె సంబంధిత వ్యాధులు అధికంగా దాడి చేస్తున్నాయి. జీడిపండులో ఉండే కొవ్వు పదార్థాలు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఈ కొవ్వు మంచిది, చెడు కొవ్వు కాదు. అందుకే ఆ కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. 
4. అధిక బరువును తగ్గించడంలో ఇవి సాయపడతాయి. దీనిలో డైటరీ ఫైబర్ ఎక్కువ. దీని వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఊబకాయులు ఈ పండ్లను తరచూ తినడం వల్ల మేలు జరుగుతుంది. 
5. కండరాలు, కణజాల రక్షణకు జీడిపండ్లు మేలు చేస్తుంది. వాటిని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 
6. ఈ పండులో కాల్షియంతో పాటూ ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.
7. రక్త హీనతతో బాధపడేవారు జీడిపండును తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇనుము శరీరంలో తగినంత ఉంటే శరీరమంతా ఆక్సిజన్ బదిలీ జరుగుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
8. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. దీనిలో అధికస్థాయిలో లూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ నుంచి కళ్లను కాపాడతాయి. కంటి శుక్లం ఏర్పడకుండా కాపాడుతుంది. 

Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?

Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget