News
News
వీడియోలు ఆటలు
X

Mosquito Coils: ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా? ఇది రోజుకు వంద సిగరెట్లు తాగడంతో సమానం

దోమలను తరిమేందుకు మస్కిటో కాయిల్స్ వాడేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది.

FOLLOW US: 
Share:

Mosquito Coils: దోమల నుండి తప్పించుకోవడం కోసం ఇంట్లో ఎంతో మంది మస్కిటో కాయిల్స్ ను వాడతారు. దాన్ని వెలిగించి వదిలేస్తే ఆ మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ భరించలేక దోమలు బయటకు పోతాయి. కానీ ఆ పొగ వల్ల ఇంట్లోని మనుషులకు తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆ పొగ 100 సిగరెట్లు కాల్చడంతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇంట్లో మస్కిటో కాయిల్స్ వాడడం మానుకుంటేనే మంచిది. 

మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగను పీల్చే వ్యక్తులకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనారి డిసీజ్ (COPD) వచ్చే అవకాశం ఎక్కువనే చెబుతున్నారు వైద్యులు. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ప్రతిరోజు ఆరుగురు వ్యక్తులు ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి కారణమై ప్రాణాలు కోల్పోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం 2019లో COPD కారణంగా మన దేశంలో ప్రతి లక్ష మందిలో 98 మంది మరణించినట్టు అంచనా. ధూమపానం అలవాటు ఉన్నవారు అధికంగా ఈ వ్యాధి బారిన పడతారు. కానీ ధూమపానం అలవాటు లేని వారు కూడా మస్కిటో కాయిల్స్  కారణంగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఏటా 4.3 మిలియన్ల మంది మరణాలకు ఇంట్లో ఉండే కాలుష్యమే కారణం.

మస్కిటో కాయిల్స్ కాల్చడం వల్ల ఉత్పత్తి అయ్యే పర్టికులేట్ అనే పదార్థం 75 నుండి 137 సిగరెట్లు కాల్చడానికి సమానమని ఒక అధ్యయనం చెప్పింది. ఇది అనారోగ్యానికి కారణమవుతుందని వివరించింది. మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ శ్వాసకోశ సమస్యలను పెంచుతుందని వివరించింది. మస్కిటో కాయిల్స్ ను రోజూ కాల్చడం వల్ల ముఖ్యంగా రాత్రి నిద్రపోతున్నప్పుడు కాల్చడం వల్ల ఆ పొగ గదిలోనే ఉండిపోతుంది.దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. నిద్రకు భంగం కలుగుతుంది. కళ్ళు మంటలు, ఎరుపెక్కడం వంటివి జరుగుతుంది. ఆస్తమా ఉన్నవారికి ఈ పొగ చాలా ప్రమాదకరం. వికారం వాంతులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, గురక,  తుమ్ములు వంటివి వస్తూ ఉంటాయి. గొంతు నొప్పి వంటివి కూడా రావచ్చు. చాలా గంటలు పాటు ఈ పొగను పీల్చినట్టయితే ఊపిరాడని పరిస్థితి కూడా వస్తుంది. రక్తంలో ఈ వాయువులు కలిసి గుండె వరకు చేరితే ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు, పిల్లలు ఈ పొగను పీల్చడం చాలా ప్రమాదకరం. 

Also read: ప్రయాణంలో వాంతులు అవుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 16 May 2023 10:16 AM (IST) Tags: Cigarettes Mosquito coils Mosquito coils Danger Mosquito coils at home

సంబంధిత కథనాలు

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా? కొత్త అధ్యయనంలో ఏం తేలింది?

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Diabetes Diet Plan: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు