By: Haritha | Updated at : 16 May 2023 10:08 AM (IST)
(Image credit: Unsplash)
Motion Sickness: కొందరికి బస్సు పడదు, మరికొందరికి కారు పడదు, ఇంకొందరికి విమానం పడదు. ఎక్కితే చాలు వికారం మొదలై వాంతులు అయిపోతాయి. అందుకే ప్రయాణం అంటే చాలు భయపడిపోయే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. వీటిని ‘మోషన్ సిక్‌నెస్’ అని పిలుస్తారు. అలాగే కైనెటోసిస్ అని కూడా అంటారు. ఈ సమస్య వల్ల ప్రయాణిస్తున్నప్పుడు వారికి పొట్టలో తిప్పినట్టు అయి, వాంతులు అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ప్రయాణం సమయంలో కళ్ళు, లోపలి చెవి, మెదడు మధ్య సమన్వయం తగ్గడమే.
లోపలి చెవిలో ‘ఎండోలింపు’ అనే ద్రవం మనం ప్రయాణంలో కదులుతున్న విషయాన్ని గ్రహిస్తుంది. ఆ విషయాన్ని మెదడుకు చేరవేస్తుంది. ఒకవేళ మనం ప్రయాణిస్తున్నప్పుడు కదలడం అనేది ఆ ద్రవం నుంచి కాకుండా కళ్ళ నుంచి మెదడు సమాచారం అందుకుంటే కాస్త తికమకపడుతుంది. ఈ తికమక పడిన విషయాన్నే వాంతి, వికారం వంటి లక్షణాల ద్వారా బయటపెడుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటివి కూడా కలుగుతాయి. కాబట్టి ప్రయాణాల్లో వాంతి, వికారాలు కలగకుండా తగ్గించే కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ప్రయాణాల్లో వాంతులు అయ్యే అవకాశం తగ్గవచ్చు.
చిట్కాలు ఇవిగో..
1. విమానాల్లో, రైళ్లలో, బస్సుల్లో కిటికీ పక్క సీటును ఎంచుకోవాలి.
2. ప్రయాణానికి ముందు ఏమీ తినకపోవడం చాలా మంచిది. నిమ్మకాయను చేత్తో పట్టుకొని దాని వాసన పీలుస్తూ ఉంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.
3. ముఖ్యంగా మీ దృష్టిని మరల్చుకోవాలి. ఇష్టమైన సంగీతం వినడం, సినిమా చూడడం వంటివి చేసుకోవాలి.
4. వీలైతే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకోవాలి.
5. ఎక్కువగా నీరు తాగడం వల్ల కూడా వాంతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందు మీరు ఆహారం తీసుకోకూడదు.
6. ధూమపానం అలవాటు ఉంటే ప్రయాణంలో కానీ, ప్రయాణానికి ముందుగానే సిగరెట్లు కాల్చకూడదు.
7. పుల్ల పుల్లని రుచి ఉండే చాక్లెట్లను నోట్లో పెట్టుకుని చప్పరించడం మంచిది. అలాగే అల్లం రుచి కూడా వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది.
8. వైద్యుల సలహా తీసుకొని ప్రయాణానికి గంట ముందు వాంతి రాకుండా అడ్డుకునే మాత్రలు వేసుకోవడం మంచిది.
ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇలా మోషన్ సిక్‌నెస్ సమస్య ఉన్నట్టు అంచనా. పిల్లల్లో, మహిళల్లో అధికంగా ఇది కనిపిస్తుంది. ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణం చేస్తే వాంతులయ్యే అవకాశం పెరుగుతుంది.
Also read: సిగరెట్లు కాల్చడం వల్ల మెదడు పరిమాణం తగ్గిపోతుంది, జాగ్రత్త
Also read: మా పనిమనిషి పెళ్లి చేసుకున్న పద్ధతి నాకు నచ్చలేదు, ఆమెకు నచ్చజెప్పడం ఎలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Chai-Biscuit: ఛాయ్‌తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి
Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?