అబ్బా, ఎంత మంచి ఓనరో! దీపావళి వేళ ఉద్యోగులకు బహుమతిగా కార్లు, బైకులు
దీపావళి పండుగ వేళ తన నగల దుకాణంలో పని చేసే ఉద్యోగులకు యజమాని మర్చిపోలేని బహుమతులు ఇచ్చాడు. ఖరీదైన కార్లు, బైకులు అందజేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
యజమానులు అందరూ ఒకేలా ఉండరు. కొంత మంది జయంతి లాల్ మాదిరిగా నిండైన హృదయాన్ని కలిగి ఉంటారు. తమ సంస్థ అభ్యున్నతి కోసం నిరంతరం ఉద్యోగులు కష్టపడితే, వారి కష్టానికి తగిన గౌరవాన్ని తనూ అందిస్తూనే ఉంటారు. మరికొద్ది రోజుల్లో దీపావళి సంబురాలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగుల ముఖాల్లో కొత్తకాంతులు వెలిగించాడు జయంత్ లాల్.
కార్లు, బైకులు అందజేత
తమిళనాడు రాజధాని చెన్నైలోని చల్లానీ జువెల్లరీ మార్ట్ అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఈ సంస్థ యజమాని జయంతి లాల్ ఛాయంతి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తోంది. దీపావళి పర్వదినానికి ముందు తన నగల దుకాణంలో పని చేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్చపరిచారు. తమ సిబ్బందిలోని 8 మందికి కార్లను, 18 మందికి బైక్‌లు అందించారు. వీటి కోసం ఆయన రూ.కోటి 20 లక్షలు ఖర్చు చేశారు జయంతి లాల్ ఛాయంతి. ఈ బహుమతులను సిబ్బందికి అందజేస్తుండగా, వారంతా ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత ఎంతో సంతోషపడ్డారు.
Read Also: భార్యతో కలిసి అంతరిక్షయాత్రకు, స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం! ప్రపంచంలోనే తొలిసారి
ఉద్యోగుల పని తీరు వల్లే లాభాలు, అందుకే ఈ బహుమతులు
తన నగల దుకాణంలో పని చేసే ఉద్యోగులు వ్యాపార అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి తనకు తోచిన బహుమతులు అందిస్తున్నాని జయంతి లాల్ ఛాయంతి తెలిపారు. “మా ఉద్యోగులే నాకు రెండో కుటుంబం. నా కష్టసుఖాల్లో పాలు పంచుకునేది వారే. నేను ఎత్తుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్నది మా సిబ్బందే. నేను లాభాలు పొందడానికి కూడా వారే కారణం. ఇలా బహుమతులు ఇవ్వడం వల్ల వారి.. పనిని మరింత ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. వారి జీవితాల్లో ఈ బహుమతులు చాలా స్పెషల్ గా ఉండిపోతాయి. అందుకే వారికి కార్లు, బైక్‌లు గిఫ్ట్స్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాను. ప్రతి ఓనర్ కూడా తమ సిబ్బందికి ఇలాంటి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి” అని జయంతి లాల్ వివరించారు.
Chennai, Tamil Nadu | A jewellery shop owner gifted cars and bikes to his staff as Diwali gifts
— ANI (@ANI) October 17, 2022
They have worked with me through all ups and downs. This is to encourage their work. We are giving cars to 10 people and bikes to 20: Jayanthi Lal, owner of the jewellery shop (16.10) pic.twitter.com/xwUI0sgNRn
ఓనర్ అంటే ఇలా ఉండాలి!
దీపావళి వేళ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు బహుమతులు ఇచ్చిన ఫోటోలను చల్లానీ జువెల్లరీ మార్ట్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. ఉద్యోగులు, సిబ్బంది పట్ల తమకు ఎంతో ప్రేమ ఉందని, ఆ ప్రేమను ఇలా బహుమతుల రూపంలో చూపిస్తున్నామని వెల్లడించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓనర్ అంటే ఇలా ఉండాలి. ఇలాంటి వారి కోసం ఉద్యోగస్తులు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి దీపావళి సందర్భంగా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తుంటాయి. మరికొన్ని సంస్థలు పలు బహుమతులు ఇస్తుంటాయి. కానీ, జయంతి లాల్ కార్లు, బైక్‌లు బహుమతులుగా ఇవ్వడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: దేవతల ఆహారమంటూ కీటకాల గుడ్లను తినేస్తున్న జనం, ఎక్కడో తెలుసా?