(Source: ECI/ABP News/ABP Majha)
కలర్‌ఫుల్ టౌన్.. ప్లాస్టిక్ బొమ్మలు కావు.. ఇవన్నీ ఇళ్లే! ఎక్కడో తెలుసా?
ఈ ఫొటో చూడగానే చిన్న పిల్లలు ఆడుకొనే లెగో బ్రిక్స్ గుర్తుకొస్తున్నాయి కదూ. ఉక్రెయిన్ వెళ్లినప్పుడు తప్పకుండా వీటిని చూడండి.
ఈ కలర్‌ఫుల్ ఫొటోలో కనిపిస్తున్నవి ప్లాస్టిక్ బొమ్మలు కాదు. అవన్నీ ఇళ్లే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఉక్రెయన్ వెళ్లాల్సిందే. అక్కడ కీవ్ నగరంలో ఈ కలర్‌ఫుల్ కట్టడాలు ఉన్నాయి. ‘కంఫర్ట్ టౌన్’ అని పిలిచే ఈ పట్టణ నిర్మాణం 2019లో పూర్తయ్యింది. అప్పటి నుంచి ఆ భవనాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
ఇక్కడి ప్రతి బిల్డింగ్ పింక్, ఆరెంజ్, గ్రీన్, పసుపు రంగుల్లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. విహంగ వీక్షణంలో ఈ భవనాలు చిన్న పిల్లలు ఆడుకొనే లెగో బ్రిక్స్ తరహాలో కనిపిస్తాయి. దీంతో అంతా వీటిని లెగో బిల్డింగ్స్ అని పిలుస్తున్నారు. డిజైనర్లు డిమిట్రో వాసిలీవ్, అలెగ్జాండర్ పోపోవ్, ఓల్గా అల్ఫియోరోవాలు ప్రాజెక్ట్ కోసం పదకొండేళ్లు శ్రమించారు. మొత్తం 115 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. కేఫ్‌లు, దుకాణాలు, నివాస సముదాయాలు, హోటళ్లు, కార్యాలయాలు కలిపి 8,500 ఫ్లాట్లను వీరు వివిధ రంగులతో నింపేశారు.
Also Read: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ ఎందుకివ్వరు? మన చట్టాలు ఏం చెబుతున్నాయ్?
ఈ రంగుల లోకం గురించి తెలియగానే.. ఆ ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు. ఫిబ్రవరి 2020లో ఆ దేశంలోనే అత్యధికంగా నెలకు 200 కంటే ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయంటే.. డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంఫర్ట్ టౌన్‌లో 20,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ పట్టణం మాత్రమే కాదు.. పశ్చిమ టర్కీలోని ఒక చిన్న రిసార్ట్ పట్టణం కూడా ఇలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే.. దక్షిణ కొరియాలోని బాన్వోల్ ద్వీపం ఊదా రంగులో భలే అందంగా ఉంటుంది. మలగాలోని ఒక గ్రామంలో ప్రతి భవనం నీలం రంగులో ఉంటాయి. ఇటీవల ముంబయిలో కూడా కొన్ని మురికివాడలను స్వచ్ఛంద కార్యకర్తలు కలర్‌ఫుల్ చిత్రాలతో అందంగా మార్చేశారు. ఏది ఏమైనా రంగులను చూస్తే మనసుకు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది కదూ.
Also Read: కపుల్స్‌కు ‘డర్టీ మైండ్’ ఉండాలా? ఏ వయస్సులో సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది? టెస్టోస్టెరాన్ అంటే?
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి