Viral Video: అమ్మను పెళ్లి దుస్తుల్లో అలా చూసి, నిజమైన ఆనందం అంటే ఇది, వీడియో చూడాల్సిందే

ఓ పిల్లాడు తన తల్లిని పెళ్లి దుస్తుల్లో చూసి ఎంత ఆనందపడ్డాడో మీరూ చూడండి.

FOLLOW US: 

పిల్లలు దేవుడి ప్రతిరూపాలను చెబుతారు. కల్మషం లేని ఆ మనసుల్లో అసలైన ఆనందం దాగుందని అంటారు. ఈ రెండేళ్ల పిల్లాడి ఆనందాన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. తన తల్లి ఏం చేస్తుందో తెలిసే వయసు కాకపోయినా, అమ్మ కొత్తగా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయే సరికి సంతోషం పట్ట లేకపోయాడు. వధువుగా మారిన అమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ రెండేళ్ల బాబు పేరు పియర్సన్. ఉండేది అమెరికాలో. ఈ బాబు తల్లి దండ్రులు క్రిస్టీ, బాబీ. వీరిద్దరి పెళ్లి ఈ మధ్యనే జరిగింది. ఆ పెళ్లి పెద్దగా వ్యవహరించింది ఈ చంటి పిల్లాడే. పియర్సన్ సాక్షిగానే అతని తల్లి దండ్రులు పెళ్లి చేసుకున్నారు. క్రిస్టీ, బాబీ కరోనా రాక ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సహజీవనం కారణంగా క్రిస్టీ గర్భం దాల్చింది. కానీ కరోనా రావడం, లాక్ డౌన్ పడడం వీటన్నింటి కారణంగా పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పియర్సన్ కు రెండేళ వయసు వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకూడదని పెళ్లికి సిద్ధమయ్యారు. 

అమ్మ కోసం బంధువులతో కలిసి పెళ్లి వేదిక వద్ద వేచి ఉన్నాడు పియర్సన్. కొంత దూరంలో అమ్మ తెల్లటి, పొడవాటి గౌనులో నడుచుకుంటూ రావడం చూసిన పియర్సన్ ఆనందం పట్టలేకపోయాడు. అమ్మను అలాంటి డ్రెస్సులో ఎప్పుడూ చూడలేదు. ‘హే మా’ అంటూ పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరికీ వెళ్లిపోయాడు. తరువాత తండ్రి బాబీ కూడా వారికి జతకలిశాడు. తల్లి దండ్రులిద్దరిని చేయి పట్టుకుని వేదిక వద్దకు తీసుకొచ్చాడు పియర్సన్. ముద్దుల బాబు సాక్షిగా వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగపెట్టారు. తల్లిదండ్రుల పెళ్లికి పియర్సన్ కూడా చాలా ముద్దుగా రెడీ అయ్యాడు.

Also read: ఈ బ్లడ్ గ్రూపుల వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ

Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది

Also read: రోగనిరోధక శక్తిని పెంచే అల్లం వెల్లుల్లి సూప్, తయారీ ఇలా

Published at : 09 May 2022 07:54 AM (IST) Tags: Viral news Trending wedding Video news Mother Marriage

సంబంధిత కథనాలు

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Vitamin D vs Diabetes: ‘విటమిన్-D’ సప్లిమెంట్లు మధుమేహాన్ని అడ్డుకుంటాయా? ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Memory Loss With Sex: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Dangerous Medicine: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

Sunscreen Benefits: సన్ స్క్రీన్‌తో చర్మం నల్లగా మారిపోతుందా? ఈ 8 అపోహలను అస్సలు నమ్మొద్దు!

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్‌ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత