By: ABP Desam | Updated at : 08 May 2022 06:55 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
అల్లం వెల్లుల్లి సూప్ తాగేందుకు బాగోదేమో అనుకుంటారు చాలా మంది, కానీ ఈ రెండింటితో చేసే సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి నూనెలో వేపుతుంటేనే మంచి సువాసన వస్తుంది. వెజ్ కర్రీలు, నాన్ వెజ్ కర్రీలు, బిర్యానీ రెసిపీలకు మంచి రుచిని ఇవ్వడంలో అల్లం వెల్లుల్లి పేస్టు ముందుంటుంది. ఈ రెండు జతకడితే రోగినిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు కొందరిలో వేధిస్తాయి. వారు అల్లం వెల్లుల్లి సూప్ తాగడం వల్ల వారిలో మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మహిళలు వారానికోసారైనా ఈ సూప్ ను తాగితే చాలా మంచిది. రుతుస్రావం సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కనుక, గుండె ఆరోగ్యానికి చాలా మేలు. ఇందులోని యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో సమర్థంగా పోరాడతాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. బరువు తగ్గేందుకు ఈ సూప్ చాలా ఉపయోగపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
అల్లం - చిన్న ముక్క
క్యారెట్ తరుగు - రెండు టీ స్పూన్లు
మిరియాల పొడి - పావు టీస్పూను
కొత్తిమీర తరుగు - మూడు టీ స్పూనులు
నీరు - సరిపడినన్ని
ఉప్పు - మీ రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూను
నెయ్యి - ఒక టీస్పూను
తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. నెయ్యి వేడెక్కాక దంచిన వెల్లుల్లి, అల్లం వేసి వేయించాలి.
3. తరువాత క్యారెట్ తరుగు కూడా వేసి కాసేపు వేయించాలి.
4. క్యారెట్ తరుగు కాస్త మెత్తగా మగ్గేవరకు ఉడికించాలి.
5. మిరియాల పొడి, కాస్త ఉప్పు కూడా వేసి మరిగించాలి.
6. ఈ లోపు రెండు కప్పుల నీళ్లలో కార్న్ ఫ్లోర్ కలిపి ఆ నీళ్లను కళాయిలోని మిశ్రమంలో వేయాలి.
7. మూడు నిమిషాల పాటూ ఉడికించి పైన కొత్తి మీర చల్లి దించేయాలి.
గోరు వెచ్చగా ఈ సూప్ ను మూడు రోజులకోసారి తాగితే చాలా మంచిది. రోగినిరోధక శక్తి పెరుగుతుంది.
Also read: ఈ బొమ్మలో మొత్తం ఎన్ని జంతువులున్నాయో కనిపెట్టండి చూద్దాం
Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది
Amla Juice: ఉదయాన్నే ఉసిరి రసం తాగితే ఇన్ని ఉపయోగాలా? ఇది తెలియక చాలా మిస్సవుతున్నాం!
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!
బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!
Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్లా తినేశాడు
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ