Weight Loss Tips: అధిక బరువును కంట్రోల్ చేసే అద్భుతమైన 10 చిట్కాలు - ఈ రోజు నుంచే ట్రై చెయ్యండి
Weight Loss Tips: ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ ఊబకాయులుగా మారిపోతున్నారు. అధిక బరువును కంట్రోల్ చేసేందుకు ఈ పది టిప్స్ ఫాలో అవ్వండి.
Weight Loss Tips: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న జీవనశైలీ, తినే ఆహారంలోనూ అనేక మార్పులు, శారీరక శ్రమకు దూరమడం కారణంగా ఊబకాయం పెరిగిపోతుంది. అయితే అధిక బరువును తగ్గించుకోవడంలో రోజువారీ అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. శారీరక శ్రమ మన శరీరంలో కొవ్వును కరిగించడంతోపాటు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. రోజువారిగా మీరు తినే ఫుడ్ మీ బరువుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండగా.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా అలవర్చుకోవాలి. అధిక బరువు నుంచి సులభంగా ఉపశమనం కలిగించే 10 టిప్స్ గురించి తెలుసుకుందాం.
నీరు పుష్కలంగా తాగాలి
భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడటంతోపాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల మనం తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. శరీరమంతా పోషకాలను బదిలీ చేస్తుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
ప్రోటీన్ ఫుడ్ తినండి:
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఇవి మీ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి. అధిక ప్రొటోన్లు కలిగిన ఆహారం మిమ్మల్ని అతిగా తినకుండా కంట్రోల్ చేస్తాయి. ఈ ప్రొటీన్ ఫుడ్ కండరాల పెరుగుదల చక్కటి సహాకారం అందిస్తుంది. జీవక్రియకు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పద్ధతిగా తినడం అలవాటు చేసుకోండి :
మీరు తినే ప్రతి ఆహార పదార్థంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఇష్టమైన ఫుడ్ ను ఆస్వాదించడం తప్పులేదు కానీ, ఏదైనా అతిగా తినకూడదనే విషయాన్ని ఎప్పటికప్పుడూ గుర్తుంచుకోంది. ఆకలితో ఉన్నపుడు ఏలాంటి ఫుడ్ తినాలనే విషయంలో అవగాహన పెంచుకోవాలి. అలా చేయడంవల్ల అతిగా తినకుండా జాగ్రత్తపడొచ్చు.
తగినంత నిద్ర:
సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీంతో అతిగా తినడానికి దారితీస్తుంది. ప్రతిరోజు సంపూర్ణమైన నిద్ర ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సులభంగా బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర :
ప్రాసెస్ చేయబడిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు. అధిక చక్కెర స్థాయిలు ఉండటం వల్ల బరువు పెరగటంతో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బరువు తగ్గించుకోవడానికి పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
శారీరక శ్రమ:
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మన శరీరానికి కావాల్సిన కేలరీలు అందుతాయి. వ్యాయామం జీవక్రియను, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించునేందుకు నడక, యోగా, ఆటలు ఆడటం వంటివి తప్పకుండా రోజువారి అలవాట్లతో భాగం చేసుకోండి.
ఆరోగ్యకరమైన స్నాక్స్ :
ఆకలి వేధిస్తున్నప్పుడు అధిక పోషకాలున్న స్నాక్స్ మాత్రమే తినండి. ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి. బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, గింజలు వంటి స్నాక్స్‌ను ఎంచుకోండి.
మొబైల్ యాప్:
ఆరోగ్యకరమైన ఆహారాలు, జూస్ లు, ఇతరత్ర సలహాల కోసం మొబైల్ యాప్‌ని ఉపయోగించండి. అందువల్ల ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతుంది. శారీరక ఎదుగుదల కోసం మంచి ఫుడ్ ను ఎంచుకునేందుకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి బాడీకి కావాల్సిన కేలరీలను అందించడంలో ఫుడ్ యాప్స్ ఎంతో మేలు చేస్తాయి.
ఇలా కంట్రోల్ చేయండి :
మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోకుదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు తినే ముందు చిన్న ప్లేట్‌లను ఉపయోగించండి. ప్రతి పూటకు కొలతలు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువును సులభంగా నియంత్రించగలరు.
ఒత్తిడి తగ్గించే మార్గాలు ఎంచుకోండి:
దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్స్, ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇలాంటి సమయంలో ధ్యానం, యోగా, వ్యాయామం లేదా మీ అభిరుచుల వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. మీ ఆహారం లేదా వ్యాయామ దినచర్యలో మార్పులు చేసుకునేముందు ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.
Also Read: ‘మదర్స్ డే’కి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి ప్రయత్నించండి - అమ్మ ఆనందిస్తుంది