అన్వేషించండి

license for Food: ప్రపంచంలో ప్రమాదకరమైన వంటకం... దీన్ని వండాలంటే లైసెన్స్ అవసరం

ఇంతవరకు ప్రపంచంలో ఏది వండాలన్నా ఎలా వండాలో తెలిస్తే చాలు, కానీ ఈ చేపను వండాలంటే మాత్రం లైసెన్స్ కూడా అవసరం.

ప్రపంచంలోనే ప్రమాదకరమైన వంటకాల్లో ఒకటి జపాన్‌కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’.జపాన్లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. ఈ చేపను వండాలంటే బాగా  అనుభవం ఉన్న, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. ఈ చేపలో ఉండే విషాన్ని ‘టెట్రోడోక్సిన్’గా గుర్తించారు.  ఈ విషం చేపలో ఏ భాగంలో ఉంటుందో, ఆ భాగాన్ని జాగ్రత్తగా వేరు చేసి దూరంగా పడేస్తారు. చుక్క విషం మిగిలిపోయి వండేసినా దాన్ని తిన్నవారికి నోరు తిమ్మిరెక్కిపోవడం, పక్షవాతం రావడం, ఒక్కోసారి మరణం సంభవించడం కూడా జరుగుతుంది. 

మరెందుకు ఈ చేపను తినడం?
ఈ చేప చూడటానికి బెలూన్లా ఉబ్బి ఉంటుంది. నిష్ణాతులైన వంటగాళ్లు దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేస్తారు. చర్మాన్ని ఒలిచేస్తారు. ఈ చేప పొట్టలోని ఓవరీస్, లివర్, పేగులు చాలా విషపూరితమైనవి. స్థానికులు చెప్పినదాని ప్రకారం సైనేడ్ కన్నా ఈ విషం 200 రెట్లు తీవ్రమైనది. జపాన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటివరకు 23 మంది ఈ చేప విషం వల్ల మరణించారు. అయితే ఈ చేప మిగతా భాగాలు చాలా రుచిగా ఉంటాయి. ఆ రుచికి జపనీయులు దాసోహం అయిపోయారు. అందుకే తమ ప్రాణాలను కూడా రిస్క్ చేసి మరీ తింటున్నారు.

16వశతాబ్ధంలో జపాన్లో ఈ చేపపై నిషేధం విధించారు. కానీ తిరిగి 1888లో ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు. అయితే ఈ చేప వండడానికి లైసెన్సులు ఇచ్చే పద్దతిని ప్రవేశపెట్టారు. జపాన్లోని ‘షున్‌పార్నో’ అనే రెస్టారెంట్ వారికి మాత్రమే ఈ చేపను వండే లైసెన్స్ ప్రభుత్వం ఇచ్చింది. 

గ్రిల్డ్ ఫుగు, ఫ్రైడ్ ఫుగు, ఫుగు రైస్, ఫుగ్ హాట్ పాట్... ఇలా చాలా రకాల వంటలు ఈ చేపతో వండుతారు. దీన్ని వండేవారికే కాదు, తినేవారికి చాలా ధైర్యం కావాలి.  

Read Also: ఈ అయిదు ఆహారాలకు దూరంగా ఉంటే మెమొరీ, ఏకాగ్రత పెరుగుతాయి... హార్వర్డ్ నిపుణులు

Read Also: ప్రతి చిన్ననొప్పికి పెయిన్ కిల్లర్ వాడుతున్నారా? గుండె, కాలేయానికి తప్పదు ముప్పు

Read Also: కొత్త వేరియంట్ పై ఆ వ్యాక్సిన్ చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందట, ఆ వ్యాక్సిన్ ఏదంటే...

Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

Read Also:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget