అన్వేషించండి

Belly Fat: ఈ సింపుల్ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది

పొట్ట చుట్టూ కొవ్వు కరిగించుకోవడానికి జిమ్ లో కష్టమైన ఎక్సర్ సైజ్లు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈ సింపుల్ వ్యాయామాలతో అది సాధ్యపడుతుంది.

ఒకే చోట కదలకుండా తరబడి కూర్చుని పని చేయడం వల్ల అందరికీ బొజ్జ వచ్చేస్తుంది. దానికి తోడు నోటికి నచ్చింది కదా అని జంక్ ఫుడ్ లాగించడం కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దాన్ని కరిగించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పోషకాహార నిపుణులు చెప్పిన విధంగా సమతుల్య ఆహారం తీసుకుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు. ప్రతిరోజు తీసుకునే కేలరీలని పరిమితం చెయ్యాలి. ఎంత తీసుకుంటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారనేది చాలా ముఖ్యం.

బెల్లీ ఫ్యాట్ వల్ల సమస్యలు

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్ల శరీరం వికారంగా కనిపించడమే కాదు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు, ఊబకాయం ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. గుండె పోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన అనారోగ్యాలకి దారితీయొచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు అవసరమయ్యే ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే అందమైన ఆకృతి పొందవచ్చు.

క్రంచెస్

పొట్ట దగ్గర కొవ్వుని కరిగించుకోవడానికి క్రంచెస్ ఎక్సర్ సైజ్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ వ్యాయామం తరచూ చేయడం వల్ల పొత్తి కడుపు భాగంలోని కండరాలు బాగా సహాయం చేస్తాయి.

ఎలా చెయ్యాలి?

ఫ్లాట్ గా ఉన్న నేల మీద పడుకుని మోకాళ్ళు వంచాలి. పాదాలు నేల మీద ఉంచి మోకాళ్ళు ముడుచుకోవాలి. రెండు చేతులు తల వెనుక భాగంలో పెట్టుకోవాలి. శ్వాసని క్రమబద్ధీకరించుకుంటూ మీ తలతో మోకాళ్ళని చేరుకోవడానికి ముందుకు వెనక్కి వంగాలి. అలా చేస్తూ మళ్ళీ సాధారణ స్థితికి వస్తూ చెయ్యాలి. 20 సార్లు ఇలా చేయడం మంచిది.

వాకింగ్

పొట్ట చుట్టూ కొవ్వుని కరిగించుకోవడంలో సహాయపడే అత్యంత ప్రభావవంతమైన కార్డియో వ్యయమాలలో ఇదీ ఒకటి. ప్రతిరోజు 45-60నిమిషాల పాటు నడవటం మంచిది. జీవక్రియని వేగవంతం చేయడమే కాకుండా పొట్ట కండరాలు, కాళ్ళని టోన్ చేయడంలో సహాయపడుతుంది.

నడిచేందుకు అవసరమైన బూట్లు ధరించడం చాలా ముఖ్యం. లేకపోతే చీలమండ దగ్గర నొప్పి రావొచ్చు. స్లో గా నడుస్తూ క్రమంగా నడక వేగాన్ని పెంచాలి. మధ్య మధ్యలో కాసేపు జాగింగ్ కూడా చెయ్యొచ్చు. నడిచేటప్పుడు చేతులు ముందుకు వెనక్కి కదిలేలా చూసుకోవాలి.

లెగ్ రైజ్

సైక్లింగ్ చేస్తూ లెగ్ రైజ్ చేయడం వల్ల అబ్స్, గ్లూట్స్, తొడ కండరాలని పటిష్టం చేయడంలో సహాయపడుతుంది. నేల మీద నిటారుగా పడుకుని తుంటి కింద చేతులు ఉంచాలి. నెమ్మదిగా పాదాలని పైకి ఎత్తాలి. అలా రెండు కాళ్ళని 90 డిగ్రీల వరకి పెంచాలి. పైకి కిందకి కాళ్ళు కదిలిస్తూ కనీసం 15 సార్లు చెయ్యాలి.

సిట్ అప్స్

సిట్ అప్స్ చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడతాయి. శరీరం బర్న్ చేసే కేలరీల సంఖ్య పెంచుతుంది. కొవ్వుని కరిగించడంలో చాలా సహాయం చేస్తుంది. చేతులు తల వెనుక పెట్టుకుని ఇలా సిట్ అప్స్ కనీసం 12 చెయ్యాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, వెంటనే ఇలా చేయాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget