By: ABP Desam | Updated at : 05 Jul 2023 07:15 AM (IST)
Image Credit: Pixabay
ఎప్పుడు అలసటతో బాధపడే వారికి ఈ ఆహారం అద్భుతమైనది అనే చెప్పాలి. రోజువారీ ఆహారంలో వీటిని భాగంగా చేసుకుంటే మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈ ఆహార పదార్థాల్లోని పోషక విలువలు స్థిరమైన శక్తిని అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి మీకు సహజమైన శక్తిని అందిస్తాయి. ఆ ఆహారాల జాబితా ఇదే..
క్వినోవా
క్వినోవా అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో కూడిన తృణధాన్యం. ఇది నిరంతమైన శక్తిని ఇస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు క్వినోవాలో బీటా గ్లూకాన్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా క్వినోవా చేసిన ఉప్మా తింటే ఆరోగ్యంగా రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
అరటిపండ్లు
ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కండరాల పనితీరు మెరుగ్గా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అయితే పరగడుపున అరటిపండు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అరటి పండుతో కలిపి వేరే పండ్లు లేదా గింజలు తీసుకోవడం మంచిది.
నట్స్, విత్తనాలు
వాల్ నట్స్, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. స్థిరమైన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడంలో సహాయపడతాయి. చిరుతిండికి బదులుగా వీటిని చిన్న బాక్స్ లో పెట్టుకుని తింటూ ఉంటే జంక్ ఫుడ్ మీదకు మనసు వెళ్లదు. ఆరోగ్యంగా ఉంటారు. చియా గింజలు నానబెట్టుకుని పొద్దున్నే తీసుకుంటే అనేక రోగాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఆకు పచ్చని కూరగాయలు
బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలు తీసుకుంటే శక్తి లభిస్తుంది. ఇందులో ఇనుముతో పాటి మెగ్నీషియం సహా శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుంది. ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడే విటమిన్ బిని అందిస్తాయి.
ఓట్స్
ఓట్స్ ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్. ఇది రోజంతా శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీవక్రియకి సహాయపడుతుంది. విటమిన్ బి కలిగి ఉంటుంది. ఓట్ మీల్ లేదా ఓట్స్ ఏ విధంగా చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మధుమేహులకు ఇది చక్కని బ్రేక్ ఫాస్ట్.
పెరుగు
పెరుగు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలని స్థిరీకరించి శక్తిని అందిస్తుంది. శక్తి ఉత్పత్తిని అవసరమైన విటమిన్లు ఉన్నాయి. ఎముకల్ని దృఢంగా చేసే కాల్షియం పుష్కలంగా ఉంటుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. పొద్దున్నే కాఫీ, టీ కి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మేలు చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చక్కని ఎంపిక.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఫ్రీజింగ్ చేసిన స్ట్రాబెర్రీల వల్ల హెపటైటిస్ A, ప్యాకెట్స్ రీకాల్ చేసిన సంస్థలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్లో ఎప్పుడు చేరాలి?
Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే
Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>