By: Haritha | Updated at : 23 Aug 2023 11:53 AM (IST)
(Image credit: Getty images)
ఒకప్పుడు రాచరికం ఈ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో బానిసలుగా బతికే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేది. బానిసలను కుక్కల కంటే హీనంగా చూస్తూ వారి చేత గాడిద చాకిరి చేయించుకునేవారు. ఇది కేవలం కొన్ని రాజ్యాల్లోనే కాదు వేల ఏళ్ల క్రితం ఎన్నో రాజ్యాల్లో అమల్లో ఉండేది. వేల మంది బానిసలుగా బతుకును ఈడ్చేవారు. తాజాగా ఇటలీలోని పాంపీ అనే నగరం సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు బానిసలు వినియోగించిన గది ఆనవాళ్లు లభించాయి. ఈ గదిని 2000 ఏళ్ల క్రితం బానిసల బెడ్ రూమ్ గా పేర్కొన్నారు ఆర్కియాలజిస్టులు. ఇదే గదిలో వారు జీవిస్తూ ఉండేవారని చెప్పారు. అప్పట్లో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఈ ప్రాంతం నాశనమైందని వారు చెబుతున్నారు. ఆ రాతి ఫలకాల మధ్యలో ఉన్న బానిసల గదులను పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీశారు.
బాగా డబ్బున్న ధనవంతులు తమ ఇళ్లల్లోనే బానిసలకు ఒక గదిని కేటాయించేవారు. ఆ గది 2000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇది పూర్తిగా మట్టితో కట్టారు. రెండు బెడ్స్ ఉన్నాయి. అయితే ఒకదానిమీద మాత్రమే పరుపు ఉన్నట్టు కనబడుతోంది. అలాగే కొన్ని సిరామిక్ గిన్నెలు, రెండు క్యాబినెట్స్ కూడా ఉన్నాయి. ఈ గదిలో ఎలుకల అవశేషాలు కూడా లభించాయి.
ఇటాలియన్ సమాజంలో బానిసలుగా బతికిన వారి సంఖ్య అధికంగానే ఉండేది. తగిన సౌకర్యాలు లేకుండా అతి చిన్న గదిలోనే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు బానిసలు. తమ యజమానులు ఇచ్చిన కాస్త డబ్బు, ఆహారంతోనే వారు జీవించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బెడ్ రూమ్‌ను బానిసలు ఉపయోగించిన బెడ్ రూమ్ అని ఇటాలియన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఇటలీలో అనేక తవ్వకాల్లో ఒకప్పుడు బానిసలు ఎలా జీవించేవారో తెలిపే ఆధారాలు బయటపడ్డాయి. చాలా చిన్న గదినే వారికి కేటాయించారని చెబుతున్నారు పరిశోధకులు.
అగ్నిపర్వతం విస్పోటనం వల్ల ఆ ప్రాంతంలో ఎంతో మంది బానిసలు మరణించినట్టు చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. గతేడాది ఈ ప్రాంతంలోనే అగ్నిపర్వతం పేలడం వల్ల మరణించిన ఒక బానిస అస్థిపంజరాన్ని కనుగొన్నారు. అతనికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను అగ్నిపర్వతం విస్పోటనం వల్ల మరణించినట్టు నిర్ధారించారు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఎప్పట్నించో అగ్ని పర్వతం పేలిన చోట ఉన్న శిధిలాలను తొలగిస్తూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఆ ప్రాంతంలో కొత్త అంశాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఆ ప్రాంతంలో వేల ఏళ్ల క్రితం చాలా ధనవంతులు నివసించే వారని, వారు తమ పనుల కోసం బానిసలను తెచ్చి పెట్టుకునేవారని చెబుతున్నారు పరిశోధకులు.
Also read: ముప్పై అయిదేళ్ల వయసు దాటాక స్త్రీ గర్భం దాలిస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందా?
Also read: మధుమేహం ఉన్నవారు మద్యం తాగుతున్నారా? ఇక అంతే సంగతులు
World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!
Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్లో ఎప్పుడు చేరాలి?
Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే
Weight Loss: జిమ్కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>