Sugar Levels: పెరిగిన మీ షుగర్ లెవెల్స్‌ని త్వరగా తగ్గించే పండు ఇదే
షుగర్ లెవెల్స్ కొందరిలో అధికంగా ఉంటాయి. వాటిని తగ్గించడానికి అద్భుత ఔషధం అవకాడో.
అవకాడో పండ్లు విదేశాలకు చెందినవి. మనదేశంలో పండడం చాలా అరుదు. ఒకప్పుడు ఇవి విదేశాల్లోనే లభించేవి, కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ప్రతి సూపర్ మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని మనం అధికంగానే దిగుమతి చేసుకుంటున్నాం. మన ఆరోగ్యానికి పూర్తిగా మేలు చేసే పండ్లలో అవకాడో కూడా ఒకటి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చేసే మేలు చాలా ఎక్కువ.
అవకాడో పండ్లు కాస్త ఖరీదైనవే. ఒక్కోపండు 80 రూపాయలు నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఈ పండులో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇంటి పదార్థాలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ పండు ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అంతేకాదు ఇలా కొవ్వు ఉండే ఏకైక పండు కూడా అవకాడో మాత్రమే. డయాబెటిస్ రోగులు అవకాడో పండును తినడం వల్ల ఈ మంచి కొవ్వులతో పాటు ఫైబర్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
సాధారణంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. వారు అవకాడోలను రోజూ తినడం వల్ల నీరసం రాదు. దీనిలో పిండి పదార్థాలు అత్యంత తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. మీరు ఉత్సాహంగా ఉండడంతో పాటూ, శరీరం దృఢంగా మారుతుంది. ఉదయాన మొలకెత్తిన విత్తనాలు తింటూ వాటితో పాటు ఒక ముక్క అవకాడో తింటే చాలు. షుగర్ లెవెల్స్ పెరగకుండా సాధారణ స్థాయికి వచ్చేస్తాయి. అలాగే సాయంత్రం కూడా అవకాడోలు తింటే షుగర్ స్థాయిలు 100 లోపే ఉంటాయి. అవకాడోను బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీనిలోని గుజ్జు చాలా మెత్తగా క్రీమ్ టైప్ లో ఉంటుంది. అందుకే దీన్ని అలా అంటారు. అవకాడోలను తినడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఈ పండు ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు గుండెకు కూడా అవకాడోలు ఎంతో మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. అవకాడోలు పండ్లు తినడం వల్ల అధిక బరువు బారిన పడకుండా ఉంటారు. వీటిని తినడం వల్ల బరువు పెరగరు.
Also read: తన కలలను కంట్రోల్ చేద్దామని, తన పుర్రెకు తానే రంధ్రం పెట్టుకున్న సైంటిస్ట్
Also read: గుండె ఆరోగ్యానికి పిండి, ఈ ఐదు రకాల పిండిని ప్రయత్నించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.