అన్వేషించండి

Kissing Disease: ముద్దు పెట్టుకుంటే వచ్చే వ్యాధి ఇది - దీనివి దాదాపు కోవిడ్ లక్షణాలే

కిస్సింగ్ డిసీజ్... ముద్దు ద్వారా వ్యాపించే ఒక ఇన్ఫెక్షన్.

కిస్సింగ్ డిసీజ్ గురించి చాలా తక్కువ మంది విని ఉంటారు. ముద్దు పెట్టుకుంటే వచ్చే ఈ వ్యాధిని ‘ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోస్సిస్’ అని సైన్స్ పరంగా పిలుస్తారు. షార్ట్‌కట్‌లో మోనో అంటారు. ఇది ఎప్స్టీన్-బార్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ లాలాజలంలో ఉంటుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందుకే లాలాజలం ముద్దు పెట్టుకున్నప్పుడే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ, కాబట్టి దీనికి కిస్సింగ్ డిసీజ్ అని పేరు పెట్టారు. పిల్లల్లో, యువతలో ఇది వచ్చే అవకాశం ఉంది. పిల్లల్ని ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. అందుకే వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఒకరు తిన్న ఆహార పదార్థాలు మరొకరు తిన్నా,  ఈ ఇన్ఫెక్షన్ ఉన్నా వారి కంచంలో మరొకరు తిన్నా ఈ అంటూ వ్యాధి రావచ్చు. ఇది మొదట సాధారణ జలుబులాగే మొదలవుతుంది.

తీవ్రమైనదా?
ముద్దు వ్యాధి తీవ్రమైన అనారోగ్యం కాదు, కానీ కోలుకోవడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. సరైన వైద్య సంరక్షణ చికిత్స అందించకపోతే మాత్రం ఇన్ఫెక్షన్ ప్రమాదకరమైన సమస్యలుగా మారిపోతుంది. వ్యాధి సోకిన వ్యక్తి కొన్ని వారాలు పాటు తన రోజువారీ కార్యాకలాపాలు చేసుకోలేరు. 

లక్షణాలు
మాయో క్లినిక్ చెబుతున్న ప్రకారం ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 
1. అలసట 
2. జ్వరం 
3. ట్రాన్సిల్స్ వాపు
4. గొంతు మంట 
5. మెడ, చంకల్లో శోషరస గ్రంధుల్లో వాపు 
6. తలనొప్పి 
7. చర్మంపై దద్దుర్లు రావడం 

ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఎవరితోనూ ఆహారాన్ని పంచుకోకూడదు. అలాగే ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. జ్వరం తగ్గి సాధారణ జీవితం గడిపే వరకు వారి వస్తువులు, ఆహారం సెపరేట్‌గా పెట్టుకోవాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. కానీ చాలా మంది కనీస జాగ్రత్తలు తీసుకోరు. కుటుంబసభ్యులకు దూరంగా ఉండరు. దీని వల్ల వారికి కూడా సోకే అవకాశం ఉంది.

పైన చెప్పిన లక్షణాల్లో ఏదైనా మీకు ఉంటే ఒకసారి వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ ముద్దు వ్యాధి బారిన పడిన వారు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువ శాతం ద్రవాలు తాగాలి. అలా చేస్తే రెండు నుంచి నాలుగు వారాల్లో కోలుకోవచ్చు.  కాకపోతే తీవ్ర అలసటగా ఉంటుంది. సరైన విశ్రాంతి, మందులు వాడకపోతే ఈ లక్షణాలు ఆరు నెలల వరకు కొనసాగే అవకాశం ఉంది.  

Also read: మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి

Also read: డయాబెటిస్ రోగులకు ఉత్తమమైన పిండి రకాలు ఇవే, వీటి వల్ల రక్తంలో చక్కెర పెరగదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget