అన్వేషించండి

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమమైన పిండి రకాలు ఇవే, వీటి వల్ల రక్తంలో చక్కెర పెరగదు

డయాబెటిస్ రోగులకు మేలు చేసే ఐదు రకాల పిండి పదార్థాలు ఇవిగో.

భారతదేశంలో మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 20 ఏళ్ల నుంచి 79 సంవత్సరాలలోపు గల జనాభాలో దాదాపు 9.6% మందిలో మధుమేహం ఉన్నట్టు ఒక అధ్యయనం చెప్పింది. ప్రభుత్వ డేటాలను పరిశీలిస్తే మధుమేహం బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నిపుణులు చెబుతున్న ప్రకారం దేశంలో మధుమేహ రోగులు పెరగడానికి కారణం వారి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు.  చాలామంది అన్నానికి బదులు గోధుమపిండితో చేసే చపాతీని మాత్రమే ఎంచుకుంటారు. అదే ఉత్తమమైన పిండి అని భావిస్తారు. దానికన్నా కొన్ని పిండి రకాలు మధుమేహలుకు ఎంతో మేలు చేస్తాయి. వాటి జాబితా ఇదిగో. 

అమరాంత్ పిండి
అమరాంత్ అనగానే ఏదో తెలియని రకం అనుకుంటున్నారా? తోటకూర గింజలనే అమరాంత్ సీడ్స్ అంటారు. వీటితో చేసే పిండే అమరాంత్ పిండి. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్లూకోనోజెనిసిస్ ప్రక్రియ ద్వారా చక్కెరస్థాయిలు రక్తంలో పెరగకుండా నియంత్రణలో ఉండేలా చూస్తుంది. అందుకే మధుమేహాన్ని నివారించడానికి నిపుణులు ఈ పిండిని ఎక్కువగా తినాలని సూచిస్తూ ఉంటారు. 

రాగి పిండి 
చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. కానీ రాగి పిండిని వాడే వారి సంఖ్య తక్కువగానే ఉంది. రాగి పిండిని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, అమైనో ఆమ్లాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుత ఔషధం అని చెప్పుకోవచ్చు.  దీన్ని కొంచెం తింటే చాలు పొట్ట నిండిన భావన వస్తుంది. తీపి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. 

తెల్ల కొమ్ముశెనగల పిండి (ChickPeas)
మధుమేహం ఉన్నవారికి ఈ పిండి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహం అదుపులో ఉంటుంది. 

హోల్ గ్రైన్ బార్లీ పిండి
ఈ పిండిలో కరిగే ఫైబర్ బీటా గ్లూకాన్ ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది.  మీ జీర్ణ వ్యవస్థలో చక్కెరను శోషించుకోవడం నెమ్మదించేలా చేస్తుంది. అలాగే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్  తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర అమాంతం పెరిగే అవకాశం ఉండదు. 

బాదంపప్పు పొడి
బాదం పప్పులను వేయించి పొడిలా చేసి పెట్టుకుంటే ఎంతో మంచిది. ఇవి గ్లూటెన్ రహిత పిండి. దీనిలో తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, గుండెకు అవసరమైన ఆరోగ్యమైన కరమైన కొవ్వులు ఈ పిండిలో అధికంగా ఉంటాయి. చాలా తక్కువ దీనిలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే పోషకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

Also read: పుదీనా చట్నీ రుచి కోసం మాత్రమే కాదు, పేగుల ఆరోగ్యం కోసం తినండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP DesamNetaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
 Vijaya Sai Reddy:  ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?
 ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా? 
Another shock for YSRCP:  రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా  ?
రాజ్యసభకు అయోధ్య రామిరెడ్డి కూడా గుడ్ బై - వచ్చే వారం రాజీనామా ?
Harish Rao: చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే  అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
చంద్రబాబు గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే అడగడం లేదు - రేవంత్ పై బీఆర్ఎస్ ఆగ్రహం
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
EX Maoist Jampanna Interview | అమిత్ షా మాటలు నమ్మొద్దు, మావోయిస్టుల అంతం సాధ్యంకాదు | ABP Desam
Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
Mamata Kulakarni : దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
దేశాన్ని ఊపేసిన మోహన్ బాబు హీరోయిన్.. కుంభమేళా లో సన్యాసినిగా....
Tirumala News: తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు - ఫిబ్రవరి 3 తర్వాత వెళ్లే భక్తులకు కీలక సూచనలు
తిరుమలలో రథసప్తమికి ఘనంగా ఏర్పాట్లు - ఫిబ్రవరి 3 తర్వాత వెళ్లే భక్తులకు కీలక సూచనలు
Viral News: కబడ్డీ ఆటలో కొట్టుకున్న మహిళా ప్లేయర్లు.. ప్రేక్షకులు కూడా తలో చేయి వేసి.. 
కబడ్డీ ఆటలో కొట్టుకున్న మహిళా ప్లేయర్లు.. ప్రేక్షకులు కూడా తలో చేయి వేసి.. 
Embed widget