By: Haritha | Updated at : 10 Apr 2023 12:04 PM (IST)
(Image credit: Youtube)
పకోడీలు, సమోసాలు తినేటప్పుడు సైడ్ డిష్‌గా ఉంటుంది పుదీనా చట్నీ. నిజానికి ఈ పకోడీ, సమోసా కన్నా పుదీనా చట్నీ తినడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దేశీ చట్నీగా చెప్పుకునే పుదీనా చట్నీ పొట్టలోని పేగుల ఆరోగ్యానికి శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ‘గట్ ఫ్రెండ్లీ చట్నీ’ అని కూడా పిలుస్తారు. మన భారతీయ వంటకాలలో పచ్చళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి పచ్చళ్ళ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టే ఆ ప్రత్యేక స్థానం దక్కింది.
పుదీనాను ఆహారంలో భాగం చేయడం వల్ల మంచి వాసనతో పాటు రుచిని ఇస్తుంది. అందుకే బిర్యానీ, మాంసాహార వంటల్లో పుదీనా లేనిదే ఆ వంటకం పూర్తికాదు. పుదీనా ఆకులలో అడాప్టోజెన్ లక్షణాలు ఉంటాయి. ఇవి వేసవిలో శరీరాన్ని చల్లగా, రిలాక్స్‌గా ఉంచుతాయి. ఈ ఔషధ గుణం శరీరంలోని ఆమ్లత్వాన్ని, వేడినీ తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో సమతుల్యతను ఏర్పరుస్తుంది. మనసును రిలాక్స్ గా ఉంచుతుంది. అందుకే వేసవి కాలంలో మజ్జిగలో పుదీనా కలుపుకొని తాగేవారు ఎంతోమంది. అలాగే నిమ్మరసంలో కూడా పుదీనా ఆకులను వేసుకొని తాగుతారు. జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
పుదీనా ఆకుల్లో సహజంగానే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనాలో ఉండే కూలింగ్ శక్తి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు పుదీనాకు అధికం. పేగులోని మంచి బాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు పుదీనా చట్నీ తయారు చేసుకుని తింటే పొట్టలోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలి?
పుదీనా చట్నీ తయారు చేయడం చాలా సులభం. పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. మిక్సీలో పుదీనా ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ పేస్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, చాట్ మసాలా చల్లవచ్చు. దీన్ని తాళింపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి బావుంటుంది. లేకుంటే చపాతీతో తిన్నా రుచిగానే ఉంటుంది. పిల్లలకు తినిపించడం కూడా చాలా ముఖ్యం.
Also read: నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో భవిష్యత్తులో ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ
Also read: 105 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి, ప్రపంచ రికార్డు ఇతని పేరు మీదే -పెళ్లిళ్లే అతని జీవనాధారం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?
Fatty Liver Disease: ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం
Demetia: డిమెన్షియాను ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి?
ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!
Workplace Burnout: ‘వర్క్ ప్లేస్ బర్న్ అవుట్’ అంటే ఏంటో తెలుసా? పెళ్లైన పురుషులకు ఈ బాధ తక్కువేనట!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు