అన్వేషించండి

Deepika Padukone: దీపిక పదుకోన్ ఆరోగ్య సమస్య ఇదే, అందుకే ఆసుపత్రికి వెళ్లింది, ఈ సమస్య ఎవరికైనా రావచ్చు

ప్రముఖ నటి దీపిక పదుకోన్ చాలా ఫిట్‌గా ఉంటుంది. ఆమెకు అనుకోకుండా ఓ ఆరోగ్య పరిస్థితి తలెత్తింది.

హైదరాబాద్ లో ప్రాజక్టు కె సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి   తెలిసిందే. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండా, బాలీవుడ్ హీరోయిన్ దీపికా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మంగళవారం హఠాత్తుగా దీపిక పదుకోన్ అస్వస్థతకు గురైంది.వెంటనే ఆమె ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని, తిరిగి సెట్స్ కి వెళ్లిపోయింది. ఆమె వచ్చిన సమస్యేంటో తెలుసా? హఠాత్తుగా గుండె అతి వేగంగా కొట్టుకోవడం. హార్ట్ బీట్ పెరగడం కూడా ఒక ఆరోగ్య సమస్యే. దీన్ని ‘టాచీకార్డియా’ అని పిలుస్తారు. 

టాచీకార్డియా అంటే...
క్లీవ్ ట్యాండ్ క్లినిక్ చెప్పిన ప్రకారం టాచీకార్డియా సమస్య వల్ల గుండె కొన్ని సెకన్ల నుంచి కొన్ని గంటల వరకు అతి వేగంగా కొట్టుకుంటుంది. సాధారణంగా హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 వరకు ఉంటుంది. అదే వంద బీట్స్ దాటితే అది సమస్యే. దాని పేరే టాచీకార్డియా. 

సూపర్ ఫిట్ కదా...
దీపికా మాజీ బ్యాడ్మింటర్ క్రీడాకారణి, యోగా చేస్తుంది, ఫిట్నెస్ గా ఉంటుంది, అధిక బరువు కూడా లేదు. అయినా ఆమెకు ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది? వైద్యులు ఏమంటున్నారంటే... గుండె రేటు అధికంగా పెరగడానికి ఒత్తిడి, శారీరక, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, శ్రమ, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు, రక్తహీనత, జ్వరం  వంటి పరిస్థితుల్లో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. 

ప్రమాదమా?
కొన్నిసార్లు ఇది సాధారణ సమస్యగానే ఉంటుంది. ఒకసారి గుండె వేగంగా కొట్టుకునే సమస్య వచ్చి సాధారణంగా మారిపోతుంది. కానీ కొన్నిసార్లు అది అంతర్లీనంగా ఉన్న గుండె సంబంధిత జబ్బులకు కారణం అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటూ గుండె దడ రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం, మూర్చ వస్తే మాత్రం వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. 

రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?
1. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రించుకోవాలి. 
2. గుండెకు హానిచేసే ధూమపానం, మద్యపానం వంటివి వదిలేయాలి. 
3. ఊబకాయం, అధిక బరువు, పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించుకోవాలి. 
4. గుండెకు అవసరమయ్యే పోషకాహారం తినాలి. 
5. టెన్షన్లు, మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటివి గుండెను ఇబ్బంది పెడతాయి. ఒత్తిడి బారిన పడకుండా చూసుకోవాలి. 

Also read: సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? ఈ ఆహారాలు మీకు సహాయపడతాయి

Also read: అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Embed widget