By: ABP Desam | Updated at : 15 Jun 2022 07:10 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
అనుకోకుండా ధూమపానం అలవాటై అది కాస్తా వ్యసనంగా మారిపోతుంది చాలా మందిలో. దాన్ని మానలేక, కొనసాగించలేక ఇబ్బంది పడే వారు ఎంతో మంది. మానేయాలని గట్టిగా అనుకుననప్పటికీ మనసు ధూమపానం వైపు లాగేస్తుంటుంది. కొన్ని రకాల చూయింగ్ గమ్‌లు, నికోటిన్ ప్యాచ్ లు ధూమపానం మానేయడంలో మీకు ఎంతో కొంత సాయం చేస్తాయి. వీటితో పాటూ కొన్ని రకాల ఆహారాలు కూడా అధికంగా తినడం వల్ల సిగరెట్ కాల్చాలన్న కోరిక తగ్గిపోతుంది.
పాలు
నికోటిన్ అండ్ టోబాకో రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 209 ఓ పరిశోధన జరిగింది. వారంతా ధూమపానం అలవాటు ఉన్నవారే.పాల ఉత్పత్తులు సిగరెట్ తాగాలన్న కోరికను అణచి వేస్తాయి. మీకు సిగరెట్ తాగాలి అనిపించినప్పుడు గ్లాసుడు వేడి పాలు లేదా, ఏదైనా పాల ఉత్పత్తి తినండి. మీకు సిగరెట్ తాగాలని అనిపించదు.
దాల్చిన చెక్కలు
దాల్చిన చెక్కలు చాలా బలమైన రుచిని, మసాలా వాసనను కలిగి ఉంటాయి. ఆ వాసనను చూస్తే చాలు సిగరెట్ తాగాలన్న కోరిక చచ్చిపోతుంది. దాల్చిన చెక్కల వాసన మీ వాసన, రుచి చూసే ఇండ్రియాలను మైకంలో పడేస్తుంది. కాబట్టి సిగరెట్ మానాలనుకుంటే అధికంగా దాల్చిన చెక్కలు వాసన చూస్తూ ఉండాలి. దాల్చినచెక్క వాసన నిండిన చూయింగ్ గమ్ లు, ఆహారాలు తింటూ ఉండాలి.
పాప్ కార్న్
ధూమపానం చేయాలని అనిపించినప్పుడల్లా చిరుతిండిన తినడం వల్ల ఆ కోరిక తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ఎక్కువమందికి సిగరెట్ తాగాలన్న కోరిక పుడుతుంది. కాబట్టి పాప్ కార్న్ వంటివి తింటూ ఉంటే ఆ కోరిక చచ్చిపోతుంది. ఇది తక్కువ కేలరీల ఆహారమే కాబట్టి బరువు కూడా పెరగరు.
కివీ
ధూమపానం చేసేవారిలో విటమిన్ సి లోపం తలెత్తుతుంది. ఇది రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. కివి తినడం వల్ల శరీరంలో విటమిన్ సి స్థాయిలు పెరుగుతాయి, అంతేకాదు నికోటిన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కివీని చిరుతిండి తినవచ్చు.
అల్లం టీ
అల్లంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ధూమపానం చేయాలన్న కోరిక అణిచివేస్తాయి. అంతేకాదు అల్లం టీ తాగాక విశ్రాంతిగా అనిపిస్తుంది. నికోటిన్ వ్యసనంతో పోరాడి, వదిలించేందుకు ప్రయత్నిస్తుంది. మైకం, వికారం వంటి లక్షణాలతో కూడా పోరాడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో అల్లం పొడి వేసి టీ చేసుకుని తాగితే మంచిది. అందులో తేనె లేదా బెల్లం వేసుకోండి. పంచదార జోలికి పోకండి.
Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!
World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?
Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?
Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?
High Blood Pressure: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల