By: ABP Desam | Updated at : 03 Dec 2022 10:29 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
ఒకప్పుడు నలభై యాభై ఏళ్లు వస్తే కానీ తెల్ల జుట్టు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 20 ఏళ్లకే తెల్ల జుట్టు వచ్చేసి అందవిహీనంగా మార్చేస్తుంది. అనారోగ్య జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. దాన్ని కనిపించకుండా చేసేందుకు హెయిర్ డై, హెన్నా అంటూ రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే జుట్టు నల్లగా ఉంచుతుంది. మళ్ళీ కొద్ది రోజులకే తెల్ల జుట్టు బయటకి వచ్చేస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చడం వల్ల వాటి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్ని పదార్థాలు జుట్టు మీద అప్లై చేయడం వల్ల కూడా సహజమైన జుట్టు రంగు పొందవచ్చు. జుట్టు పిగ్మెంటేషన్ కు హాని కలిగించకుండా తెల్ల జుట్టు రాకుండా అడ్డుకోవచ్చు. అందుకు మీరు చేయాలసిందల్లా తరచూ వీటిని తినడంతో పాటు జుట్టుకి కూడా అప్లై చేసుకోవాలి.
కరివేపాకు
ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా కరివేపాకు వేస్తారు. దాని వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ తినేటప్పుడు మాత్రం కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు. అలా చేస్తే మీ జుట్టుకి పోషణ అందదు. దీనిలో ఎన్ని శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. కరివేపాకు ముద్దని మెంతి పొడి, కొబ్బరి నూనెలో కలిపి నెలకొకసారి తలకి అప్లై చేయడం వల్ల వెంట్రుకలు పెరుగుతాయి.
చేపలు
చేపల్లో ఒమేగా 3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ప్రోటీన్ స్థాయిలు పెంచడంలో సహాయపడతాయి. మెరుగైన కణాల పునరుత్పత్తికి దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. అమినో యాసిడ్ లు జుట్టు పెరగడానికి సహాయపడతాయి. తరచూ వీటిని తినడం వల్ల కావాల్సిన పోషకాలు శరీరానికి అందుతాయి. తద్వారా తెల్ల జుట్టు నివారించవచ్చు.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. ఇది తినడానికి మాత్రమే కాదు ఉసిరి పొడి జుట్టుకి కూడా మేలు చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, 2 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్,అరకప్పు పెరుగు వేసి మూడింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత జుట్టుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి పోషకాలు అందుతాయి.
బ్లాక్ టీ
జుట్టుని నల్లగా, మెరిసేలా, మృదువుగా చేసేందుకు బ్లాక్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. 2 కప్పుల వేడి నీటిలో 3 నుంచి 5 టీ బ్యాగ్ లు ఉంచాలి. జుట్టుని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ టీ మిశ్రమంతో కడిగి మరలా సాధారణ నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు మెరిసిపోతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ పిల్లలు గంటల కొద్దీ టీవీ చూస్తున్నారా? తల్లిదండ్రులూ బీ అలర్ట్
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?
బరువు తగ్గేందుకు అతిగా వ్యాయామం చేస్తున్నారా? అస్సలు వద్దు, బెస్ట్ వర్కవుట్ ఇదే!
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
ఇమేజ్ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Inaya Sultan: తాజ్ మహల్ ముందు బిగ్ బాస్ బ్యూటీ పోజులు